Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు ఆమోదం వేస్తారనీ ఆశిస్తున్నా : రాంనాథ్ కోవింద్

సోమవారం, 29 జనవరి 2018 (11:33 IST)

Widgets Magazine
ramnath kovind

దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారి రాంనాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, ప‌థ‌కాల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. దేశ స్వ‌ప్నాలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాల‌ని, ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందుతుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 
 
అలాగే, పేద‌లు, ఉన్న‌త వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉండి, వారి ఆదాయాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు. స్వయం స‌హాయ‌క బృందాల‌ను ప్రోత్స‌హిస్తూ, దేశ అభివృద్ధిలో వారిని భాగం చేయాల‌ని రాంనాథ్ కోవింద్ వివ‌రించారు. 
 
ఆదివాసీలు, గ్రామీణులు, వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, మైనార్టీల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, ప్ర‌యోజ‌నాలు, వాటిలో సాధించిన విజ‌యాల గురించి ఆయ‌న చెప్పారు. ముస్లిం హ‌జ్ యాత్ర‌లో ప్ర‌భుత్వం చేసిన మార్పుల కార‌ణంగా ముస్లిం మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజనం చేకూరింద‌ని ఆయ‌న అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తల నరికి జెండా దిమ్మెపై పెట్టారు... ఎక్కడ?

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని ...

news

పరిటాల రవి ఇంట్లోకెళ్లి సోఫాలో కూర్చొన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దివంగత పరిటాల రవి ఇంట్లోకెళ్లి... ఆయన కూర్చొన్న సోఫాలో ...

news

చైనా కొత్త రికార్డు : 9 గంటల్లోనే రైల్వేస్టేషన్ ఏర్పాటు

చైనా కొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా తొమ్మిది గంటల్లోనే ఏకంగా రైల్వేస్టేషన్‌ను ...

news

శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి మద్దతివ్వను : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ...

Widgets Magazine