రాహుల్ నుదుట వీర తిలకం దిద్దిన ప్రణబ్

సోమవారం, 4 డిశెంబరు 2017 (14:55 IST)

rahul - pranab

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరతిలకం దిద్దారు. రాహుల్ నెత్తిన పువ్వుపెట్టి, ఆయన నుదుట వీర తిలకం దిద్దారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు ఘట్టానికి పార్టీలోని అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. 
 
వీళ్లందరి కంటే ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఆసక్తి రేపుతోంది. పార్టీ ఆఫీస్ నుంచి నామినేషన్ వేయటానికి బయలుదేరే ముందు.. రాహుల్ ప్రణబ్ ముఖర్జీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ నుదిటిన వీర తిలకం దిద్దారు. నెత్తిన పువ్వుపెట్టి ఆశీర్వదించారు. ప్రణబ్ ఇచ్చిన మద్దతు కాంగ్రెస్ నేతలకు ఫుల్ జోష్ నింపింది. 
 
రాష్ట్రపతి కాకముందు పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన దాదాకు రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సూచనలు, సలహాలు ఇస్తున్న సంగతి తెలిసింది. రాహుల్ అధ్యక్ష పీఠం ఎక్కుతున్న టైంలో ప్రణబ్ ఇచ్చిన ఆశీర్వాదం గొప్పదిగా పార్టీ నేతలు ఫీలవుతున్నారు. దీనిపై మరింత చదవండి :  
Bless Nomination Pranab Mukherjee Rahul Gandhi Congress Party

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాహుల్ మా డార్లింగ్ : మాజీ పీఎం మన్మోహన్‌

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను తమ ...

news

'నపుంసక' టీచర్ ఉద్యోగం ఊడుతుందా? నన్నపనేని ఏమన్నారు?

తాను నపుంసకుడన్న విషయాన్ని బహిర్గతం చేసినందుకు శోభనం రాత్రి తన భార్యపై పైశాచికంగా ...

news

నా కొడుకు నపుంసుకుడైతే.. నేనున్నాగా... కోడలితో మామ..

సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం ...

news

పవన్ కల్యాణ్‌కు తిక్కలేదు, లెక్క మాత్రం వుంది: జేసీ కుమారుడు

తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డిని అసెంబ్లీ ...