Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్: ఏపీలో టీడీపీకి గడ్డుకాలం.. వైకాపా?

శనివారం, 20 జనవరి 2018 (13:45 IST)

Widgets Magazine

సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు పెట్టని పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తాజా సర్వేలో తేలింది. ఫలితంగా తమిళనాట రజనీకాంత్ కింగ్ మేకర్ అవుతారని సర్వే తేల్చింది.

రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సంస్థలు తాజాగా నిర్వహించిన సర్వేలో... రజనీకాంత్ పార్టీ ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగితే తమిళనాట మిగిలిన పార్టీలకు గట్టిపోటీని ఇస్తారని తేలింది. అలాగే దేశ రాజకీయాలపై కూడా రజనీకాంత్ ప్రభావం చూపుతారని రిపబ్లిక్, సీ ఓటర్ సంస్థలు వెల్లడించాయి. 
 
ఇందులో భాగంగా తమిళ రాష్ట్రంలోని 39 స్థానాల్లో 28.3శాతం ఓట్లతో 14 స్థానాలు డీఎంకే కైవసం చేసుకుంటుందని.. 13.6 శాతం ఓట్లతో అన్నాడీఎంకే కేవలం రెండే స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. కానీ సూపర్ స్టార్ రజనీ కాంత్ 33.7 శాతం ఓట్లతో 23 స్థానాలను గెలుచుకుని, బలమైన పార్టీగా నిలుస్తుందని సర్వేలు తేల్చాయి. కానీ, కాంగ్రెస్‌, బీజేపీలు కనీసం ఖాతా కూడా తెరవవని సీ ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. 
 
ఇక దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధించనుందని తెలిసింది. గత ఏడాది చివరి వారంలో ఈ సర్వేను నిర్వహించారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే తేల్చింది. ఏపీలోని 25 ఏంపీ స్థానాల్లో వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించనుంది. టిడిపి 12 స్థానాల్లో విజయం సాధించనున్నట్టు ఈ సర్వే వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajinikanth Seats Survey Nda Upa Andhra Pradesh Lok Sabha Narendra Modi

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇక ఎగిరే విమానంలో వాట్సాప్, ఫేస్‌బుక్ చూసుకోవచ్చు

విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. విమానంపైకి ఎగిరే సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సి ...

news

భర్తకు చర్మవ్యాధి.. తాగొచ్చి లైంగిక వేధింపులు.. కత్తిపీటతో నరికి?

మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెలుపలకు ...

news

ఇక నేరస్తులు తప్పించుకోలేరు.. వీడియోలు, ఫోటోలు సాక్ష్యాధారాలు కానున్నాయట!

మొబైల్‌లో తీసుకునే ఫోటోలు, వీడియోలు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా కోర్టులు వీటిని ...

news

రజనీ-కమల్ ఎంట్రీ.. ప్రజలు ఎవరికి ఓటేస్తారో చెప్పలేం: విశాల్

తమిళనాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు ఖాయమని నటుడు విశాల్ తెలిపాడు. పందెంకోడి ...

Widgets Magazine