Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న టీచర్... గుర్తించిన పిల్లలు... ఆ తర్వాత?

మంగళవారం, 14 నవంబరు 2017 (14:04 IST)

Widgets Magazine
Maths Teacher-Beggar

బాలల దినోత్సవం నాడు కేరళలో ఓ ఉపాధ్యాయురాలికి సంబంధించిన వార్తను చూసి విద్యార్థుల హృదయం బరువెక్కిపోతోంది. బాలలకు దిశానిర్దేశం చేస్తూ తన వృత్తిలో నిమగ్నమవ్వాల్సిన ఓ ఉపాధ్యాయురాలు రోడ్డుపై భిక్షమెత్తుకుంటూ కనిపించింది. ఇంతకీ ఆమె ఉపాధ్యాయురాలని గుర్తించింది ఎవరు? తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. 
 
నవంబర్ 5న ఓ ప్రభుత్వోద్యోగి అయిన విద్య రైల్వే స్టేషనుకు తన స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. అలా వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ వృద్ధురాలు మాసిపోయిన దుస్తులతో, పాలిథీన్ బ్యాగుతో వెళుతూ వుంది. కొంతదూరం వెళ్లాక ఓ చెట్టు వద్ద ఆగి ఓ పండు కోసుకుని తినసాగింది. ఆ తర్వాత ఎవరో ఇద్దరు వ్యక్తులు ఎదురుగా నడిచి వస్తుంటే వారిని భిక్ష అడిగింది. ఇదంతా చూస్తున్న విద్య, ఆమె వద్దకు వెళ్లి ఆకలిగా వున్నదా అని అడిగి ఆమెకు సమీప హోటల్ నుంచి వడ, ఇడ్లీ తెప్పించి ఇచ్చింది. ఆమె ఎంతో ఆత్రంగా తినేసింది. 
 
ఆమె ఫోటోను తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఫేస్‌బుక్‌లో ఆమె ఫోటో చూసిన కొందరు గుండెలు బరువెక్కాయి. ఎందుకంటే ఆమె ఎవరో కాదు. తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయురాలు. ఇలా ఆమె రోడ్డుపై భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందో వాకబు చేశారు. ఆమె భర్త, కుమారుడు ఇంటి నుంచి గెంటి వేయడం వల్లనే ఆమెకు ఆ పరిస్థితి వచ్చిందని తెలుసుకుని, ఉపాధ్యాయురాలి వద్దకు వెళ్లి తమతో వచ్చేయమని అడిగారు. 
 
కానీ అందుకు ఆమె నిరాకరించారు. తన భర్త, కుమారుడు పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాననీ, వారివద్ద తప్ప ఎవరి వద్దా వుండదల్చుకోలేదని చెప్పారు. దానితో ఏం చేయాలో పాలుపోక ఆమెకు కనీసం తమవంతు సాయం చేయాలని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు కదిలారు. కాగా ఆమె రోడ్డుపై భిక్షమెత్తుకుంటూ తిరిగిన ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మణిరత్నం దర్శకత్వంలో జయసుధ - నాని!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ...

news

ప్రేమించలేదని.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. యువతి సజీవదహనం

చెన్నైలో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ప్రేమించమని వెంటపడి వేధించడంతో పాటు ఏకంగా ...

news

2018లో మే నెలలో భూమికి ముప్పు.. వరదలు, సునామీలు వస్తాయ్..

సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ భూగోళంపై మానవజాతి మనుగడ మరో 600 సంవత్సరాలు ...

news

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు... ఇప్పటివరకు రూ.66074.55 కోట్లు

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ...

Widgets Magazine