Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపిస్తా : పందెం కోడి సవాల్

గురువారం, 7 డిశెంబరు 2017 (11:32 IST)

Widgets Magazine
vishal

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజక వర్గానికి గాను ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే మధుసూదనన్ పోటీ చేయగా, డీఎంకే తరపున మరుదుగణేష్ పోటీ చేస్తున్నారు.

అయితే ఉన్నట్టుండి ఆర్కే నగర్ ఎన్నికల్లో నటుడు, పందెంకోడి హీరో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. అయితే నామినేషన్‌లో మద్దతుదారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయని తిరస్కరణకు గురైంది. హైడ్రామా నడుమ విశాల్ నామినేషన్‌కు ముందు నో ఆపై ఎస్ ఆపై నో చెప్పారు.. ఎన్నికల సంఘం అధికారులు. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో తాను నిలిచే అవకాశం లేదని అర్థం చేసుకున్న విశాల్, ఓ స్వతంత్ర అభ్యర్థికి మద్దతిచ్చి, అతన్ని గెలిపిస్తానని విశాల్ ప్రకటించాడు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు మేలు చేయాలని భావిస్తే, ఇన్ని సమస్యలు వస్తాయా అని ప్రశ్నించారు. ఓ అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేయకూడదా? అని ప్రశ్నించాడు. ఇక తన సత్తా ఏంటో చాటుతానని సవాల్ విసిరాడు. 
 
ప్రధాన పార్టీలకు తాను సవాలుగా మారుతానని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఓ యువకుడిని గెలిపిస్తానని చెప్పాడు. అతని ద్వారా తాను చేయాలనుకున్న మంచి పని చేస్తానని తెలిపారు. తన నామినేషన్ తిరస్కరణ విషయంలో ఎన్నికల వ్యవస్థపైనే నమ్మకం పోయే ఘటనలు జరిగాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని విశాల్ డిమాండ్ చేశాడు. 
 
కాగా విశాల్ నామినేషన్‌ తిరస్కరణలో అన్నాడీఎంకే హస్తం వున్నట్లు తెలుస్తోంది. విశాల్ నామినేషన్ తిరస్కరణలో అధికార వర్గం దొంగచాటు యత్నాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాల్ పేరును ప్రతిపాదించిన పదిమందిలో ముగ్గురు ప్లేటు ఫిరాయించేలా చక్రం తిప్పింది. దీంతో విశాల్  ఆర్కేనగర్ నుంచి పక్కన జరగాల్సి వచ్చింది. దీంతో విశాల్ మరో స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టి.. అతనిని గెలిపించి తన సత్తా చాటుతానన్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పిల్లలు పుట్టలేదని చిత్ర హింసలు.. అత్త ఎదుటే టెక్కీ కోడలు సూసైడ్

వివాహమై ఐదేళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదనీ భర్త చిత్ర హింసలు పెట్టడం, అత్త చీటిపోటీ మాటలు ...

news

400 ఏళ్ల తర్వాత శాప విముక్తి.. మైసూర్ రాజకుటుంబానికి వారసుడొచ్చాడు..

నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. ...

news

ఎవ్వరినీ మరిచిపోను... శేఖర్ కమ్ములను వదిలిపెట్టను : పవన్ కళ్యాణ్

మెగా హీరో వరుణ్ తేజ్‌కు బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ దర్శకుడిపై పవర్ స్టార్ ...

news

తిరుపతికి వస్తూ తిరిగిరాని లోకాలకు....

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ...

Widgets Magazine