Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమాస్తుల కేసు : శశికళ బంధువుకు ఐదేళ్ళ జైలుశిక్ష

గురువారం, 16 నవంబరు 2017 (16:29 IST)

Widgets Magazine
sasikala

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబానికి గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మంచిన ఆస్తుల సేకరణ కేసులో శశికళ బంధువుకు ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు కోర్టు తీర్పునిచ్చింది. 
 
శశికళ బంధువు భాస్కరన్ అనే వ్యక్తి భారతీయ రిజర్వు బ్యాంకులో పని చేస్తూ వచ్చారు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐటీ అధికారులు సోదాలు చేసి 1.68 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులను గుర్తించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 
 
ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు భాస్కరన్‌తో పాటు ఆయన భార్యకు ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మద్రాసు హైకోర్టులో ఆయన అప్పీల్ చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు, సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. అయితే, భాస్కరన్ భార్యకు మాత్రం మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. 
 
కాగా, ఇటీవల ఐటీ సోదాలతో ఉక్కిరిబిక్కిరి అయిన శశికళ కుటుంబ సభ్యులు తాజా తీర్పుతో మరింత షాక్‌కు గురయ్యారు. కాగా, శశికళ, దినకరన్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్ళపై ఐటీ శాఖ అధికారులు ఏకధాటిగా ఐదు రోజుల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ సోదాల్లో అధికారికంగా రూ.1430 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ విషయంలో తమ్ముడితో గొడవ పడిన మాజీ సిఎం

వద్దూ.. వద్దంటున్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ...

news

15 ఏళ్ల బాలుడితో 36ఏళ్ల మహిళ లైంగిక సంబంధం.. మగశిశువు జననం

36ఏళ్ల మహిళ సభ్యసమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కుమారుడి ...

news

బుద్ధి గడ్డి తిని ప్రియురాలిని చేసుకున్నా... ప్లీజ్ రక్షించండి... లేదంటే దూకేస్తా...

అయ్యా.. నేను నా భార్యతో వేగలేను. నన్ను రాచిరంపాన పెట్టేస్తోంది. నావల్ల కావడం లేదు. దయచేసి ...

news

కామాంధబాలుడు.. కోడిపై అత్యాచారం.. ఎక్కడ?

కామంతో రగిలిపోయే యువకులు... తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతారు. తాజాగా ...

Widgets Magazine