Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ స్కూల్‌లో తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300 ఫైన్.. ఎక్కడ?

బుధవారం, 15 నవంబరు 2017 (08:40 IST)

Widgets Magazine
Sneezing

దేశంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల తీరు తమ ఇష్టారాజ్యంగా ఉంది. తాము చెప్పిందే చట్టం. ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి తుమ్మితే రూ.200, తమిళం మాట్లాడితే రూ.300, టీసీ కావాలంటే రూ.15 వేల అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీవ్రమైన శిక్షలు విధిస్తున్న పాఠశాల తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా శెట్టిపాళెయంలో ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శెట్టిపాళెయంలోని ప్రైవేట్ పాఠశాలలో ఎదురవుతున్న వేధింపులపై విద్యార్థిని లక్ష్మి తన తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది. తమ స్కూల్ పీటీ మాస్టర్ చిన్నచిన్న సమస్యలకు పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారని ఫిర్యాదులో బాలిక పేర్కొంది. స్కూల్‌లో తుమ్మితే 200 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువసార్లు తుమ్మితే స్కూల్ మైదానం చుట్టూ రౌండ్లు వేయాల్సిందేనని తెలిపింది.
 
ముఖ్యంగా, మాతృభాష తమిళంలో మాట్లాడితే 300 రూపాయలు చెల్లించాల్సిందేనని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు మాట్లాడితే వారితో మరుగుదొడ్లు కడిగిస్తున్నారని వాపోయింది. జరిమానా కట్టకపోయినా స్కూలు మొత్తం పరుగులు తీయాల్సిందేనని, అనారోగ్యంతో బాధపడినా చేయాల్సిందేనని కన్నీటిపర్యంతమైంది. 
 
ఇంటి నుంచి తీసుకొచ్చిన మంచి నీరు తాగొద్దని, స్కూల్ ట్యాంకులోని మురికినీరే తాగాలని టీచర్లు వేధిస్తున్నారంటూ విలపిస్తూ చెప్పింది. ఈ చర్యలతో విసిగిపోయి మరో స్కూల్‌లో జాయిన్ అవ్వాలని టీసీ అడిగితే 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెదేపా మంత్రులకు వెన్నెముకలు లేవు.. జగన్ పాదయాత్ర వేస్ట్... జేసీ సెటైర్లు

జెసి బ్రదర్స్‌కు జగన్ ఫ్యామిలీ మధ్య ఉన్న రాజకీయ వైరం తెలిసిందే. గతంలో వీరు ఒకే పార్టీలో ...

news

కష్టపడి సంపాదించిన ఆదాయం అంతా హైదరాబాద్‌లో ఉంది... ఏపీ సీఎం

అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించనంతవరకు ఉద్యోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు ...

news

వెస్ట్ బెంగాల్ ప్రజలకు 'స్వీట్' న్యూస్

వెస్ట్ బెంగాల్ వాసులకు ఓ తీపివార్త. గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్, ఒడిషాల మధ్య ఓ స్వీట్‌పై ...

news

కారులో బిడ్డకు పాలిస్తున్న యువతి, ట్రాఫిక్ వాహనానికి కట్టి లాక్కెళ్లిన పోలీస్

ఈ షాకింగ్ ఘటన ముంబైలో జరిగింది. ఓ జంట చంటిపాపతో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భర్త ...

Widgets Magazine