Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీజేపీతో తెగదెంపులు.. 2019లో ఒంటరిగానే : శివసేన

మంగళవారం, 23 జనవరి 2018 (14:33 IST)

Widgets Magazine
uddhav thackeray

మహారాష్ట్రలో బీజేపీ - శివసేన పార్టీల మధ్య ఉన్న స్నేహబంధం తెగిపోయింది. వచ్చే యేడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. 1990ల నుంచే భాజపా - శివసేన మధ్య పొత్తు కుదిరింది. ఈనేపథ్యంలో ఇపుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే తాము పోటీ చేయనున్నట్లు శివసేన తెలిపింది. 
 
మంగళవారం జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. 
 
కాగా, 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనను కాదని ఒంటరిగా పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ శివసేనతో చేతులు కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ చతికిలపడగా, విపక్ష పార్టీలు పుంజుకున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశం కోసం గుండె కొట్టుకుంటోంది.. తెలంగాణ కోసం రక్తమిస్తా : పవన్

ఈదేశం కోసం గుండె కొట్టుకుంటోందని, తెలంగాణ కోసం రక్తమిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ ...

news

పెళ్లి చేస్కుంటానని లొంగదీసుకున్నాడు... కేసు పెడితే పోలీసులు అలా చేశారు(వీడియో)

తనను ప్రేమ పేరుతో మోసం చేసి లొంగదీసుకున్న ఓ యువకుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడని ...

news

భర్తను చితకబాది.. కళ్లముందే భార్యపై అత్యాచారం.. ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను చితకబాది ఆయన కళ్లెదుటే భార్యను నలుగురు ...

news

కేసీఆర్‌తో మాట్లాడితే తప్పేంటి? పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయితే తప్పేముందని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ...

Widgets Magazine