శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (10:43 IST)

రాత్రిపూట బెంగళూరులో మహిళలు కనపించకూడదు: కర్ణాటక హోం మంత్రి

కొత్త సంవత్సరం సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న యువతిపై ఇద్దరు యువకుడు లైంగికంగా వేధించిన ఘటన గుర్తుండే వుంటుంది. ఇలాంటి ఘటనలు ఐటీ రాజధాని అయిన బెంగళూరులో సర్వసాధారణమైనాయి. దీంతో మహిళలకు భద్రత కల్పించే వి

కొత్త సంవత్సరం సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న యువతిపై ఇద్దరు యువకుడు లైంగికంగా వేధించిన ఘటన గుర్తుండే వుంటుంది. ఇలాంటి ఘటనలు ఐటీ రాజధాని అయిన బెంగళూరులో సర్వసాధారణమైనాయి. దీంతో మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని.. విపక్షాలతో పాటు మహిళా సంఘాలు ఫైర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
బెంగళూరులో శాసనమండలిలో 'మహిళా భద్రత'పై జరిగిన చర్చలో రామలింగారెడ్డి మాట్లాడుతూ, అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పని ఉండదు కనుక, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదన్నారు. ఆఫీసులకు వెళ్ళే మహిళలు ఇకపై తన బంధువులను, కుటుంబీకులను తోడుగా తీసుకెళ్లాలని రామలింగా రెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. 
 
అంతటితో ఆగకుండా బెంగళూరులో మొత్తం 1.2 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ భద్రత కల్పించడం తన వల్ల కాదని కూడా మంత్రి వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రామలింగారెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. చేతకానప్పుడు హోం మంత్రి బాధ్యతల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.