Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గ్రామ పెద్ద బర్త్‌డే.. డాన్స్ బార్‌గా మారిన పాఠశాల.. అమ్మాయిలతో అర్థనగ్న నృత్యాలు

గురువారం, 10 ఆగస్టు 2017 (10:32 IST)

Widgets Magazine
dance bar

ఆ ఊరిలో గ్రామ పెద్ద పుట్టినరోజు వేడుకలను ఒక వైభంగా జరుపుకున్నారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవు ప్రకటించి.. పాఠశాల తరగతి గదులను డ్యాన్స్‌ బార్‌గా మార్చి అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు వేయించారు. ఇది బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మీర్జాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. అదే రోజు ఆ గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు కూడా. ఈ బర్త్‌డేను పురస్కరించుకుని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత అమ్మాయిలను రప్పించి వారితో అర్థనగ్నంగా నృత్యం చేయించారు. 
 
కొందరు పాఠశాలలోనే మద్యం తాగి అమ్మాయిల రికార్డింగు డ్యాన్సుతో మజా చేశారు. పాఠశాలను డ్యాన్స్ బార్‌గా మార్చిన ఘటనపై అసిస్టెంట్ ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ శిక్షా అధికారి ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలను డ్యాన్స్ బార్‌గా మార్చారని మండల విద్యాశాఖ అధికారి తివారీకి నివేదిక సమర్పించారు. 
 
పాఠశాలలో మద్యం తాగి డ్యాన్సులు చేయడం అభ్యంతరకరమని దీనిపై గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు నివేదించారు. దీనిపై వివాదం జరిగిన తర్వాతగానీ గ్రామపెద్దకు తాను చేసిన తప్పేంటో అర్థంకాలేదు. స్కూల్‌లో డ్యాన్స్ కార్యక్రమం జరిగినపుడు తాను లేనని, తన బంధువుల ఇంట్లో ఉన్నానని తప్పించుకోవడం కొసమెరుపు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మైనర్ భార్యతో బలవంతపు శృంగారం(రేప్)లో పాల్గొన్నా తప్పులేదు

దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది. మైనర్ భార్యతో బలవంతపు శృంగారం ...

news

తండ్రి కాలేజీ ఫీజు చెల్లిస్తుంటే.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్... ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో ...

news

చాలా బ్యూటీగా ఉన్నావ్.. నా కోర్కె తీరిస్తే హీరోయిన్‌గా ఛాన్సిస్తా...

సినీ ఛాన్స్‌ కోసం ఓ దర్శకుడు వద్దకు వెళ్లిన ఓ విద్యార్థినికి ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. ...

news

గంజాయి.... తెనాలి వయా తిరుపతి టు విల్లుపురం

తిరుపతిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గుంటూరు జిల్లా తెనాలి ...

Widgets Magazine