Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమించలేదని కత్తితో 40 పోట్లు పొడిచాడు.. ఎక్కడ?

శనివారం, 10 మార్చి 2018 (16:49 IST)

Widgets Magazine
girl

ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. తనంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా కొందరు యువకులు విచక్షణ కోల్పోయి యువతులను చంపేస్తున్నారు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యా చిగురించాల్సిందే. అవతలి వ్యక్తితో సంబంధం లేకుండా ప్రేమిస్తే అది ఒన్ సైడ్ లవ్ అవుతుంది. ఐతే తను ప్రేమిస్తున్నా అవతలి వ్యక్తి ప్రేమించడం లేదని వారిపై దాడికి పాల్పడటం, చంపేయడం లాంటివి చేయడం షరామామూలే అయిపోయింది. తమిళనాడు రాష్ట్రంలో అలాంటి సంఘటనే జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని 40 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
 
చెన్నై శివారులోని మధురవాయిల్‌కు చెందిన అశ్విని.. కే.కే.నగర్ లోని మీనాక్షి కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. మధురవాయిల్ లోనే ఉంటున్న అళగేశన్ గత కొన్ని నెలలుగా అశ్వినిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా అళగేశన్ వినిపించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది అశ్విని. పోలీసులు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆ తరువాతైనా అళగేశన్ సైలెంట్ అయిపోతాడని అనుకుంది అశ్విని. కానీ అతనే తన ప్రాణాన్ని తీస్తాడని ఊహించలేకుండా పోయింది. 
 
తనను ప్రేమించకపోగా.. పోలీసులతో కొట్టిస్తావా అంటూ కళాశాల నుంచి ఇంటికి వెళుతున్న అశ్వినిని నడి రోడ్డుపై 40 సార్లు కత్తితో పొడిచాడు. స్థానికులు చూస్తుండగా అళగేశన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆడపిల్లలు లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత దారుణంగా ఉంటుందో... రోజా కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ...

news

ట్యాంక్ బండ్ క్లోజ్... మిలియన్ మార్చ్ దడ... కోదండరాం కామెంట్స్

ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వక పోవటం నిరంకుశ పాలనకు నిదర్శనం ...

news

''మిలియన్ మార్చ్''‌ ఉద్రిక్తత: తెలంగాణ సర్కారుకు వణుకు.. కోదండరాం

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ''మిలియన్ మార్చ్''‌కు అప్పట్లో లక్షలాది జనం తరలివచ్చారు. తెలంగాణ ...

news

థర్డ్ ఫ్రంట్.. కేసీఆర్, చంద్రబాబు, వెంకయ్య.. వీరిలో ప్రధాని ఎవరు?

థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. స్వేచ్ఛాధికారమే అజెండాగా ...

Widgets Magazine