Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నమ్మ వర్గానికి మరో షాక్-ఓపీఎస్, ఈపీఎస్‌కే రెండాకులు

గురువారం, 23 నవంబరు 2017 (15:02 IST)

Widgets Magazine
two leaves symbol

ఎలక్షన్ కమిషన్ శశికళ వర్గానికి షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే అధికారిక రెండాకుల చిహ్నాన్ని ఓపీఎస్, ఈపీఎస్ వర్గానికి కేటాయిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండాకుల చిహ్నాన్ని తమకు కేటాయించాలనే శశికళ వర్గం డిమాండ్‌ను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత వారసులం తామేనని వాదించిన చిన్నమ్మ వర్గానికి ఈసీ షాక్ ఇచ్చింది. 
 
ఇప్పటికే ఐటీ దాడులతో భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తుల పత్రాలు పట్టుబడ్డాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో శశికళ ప్రతిష్ఠ గంగలో కలిసిపోయింది. తాజాగా ఎలక్షన్ కమిషన్ కూడా రెండాకుల చిహ్నాన్ని ఓపీఎస్, ఈపీఎస్‌కు కేటాయించడం ద్వారా మరోసారి శశికళ వర్గానికి దిమ్మదిరిగినట్లైంది.
 
దివంగత సీఎం జయలలితకు తర్వాత ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీపడేందుకు శశికళ వర్గం, ఓపీఎస్ వర్గం పోటీ పడింది. అయితే ఆర్కే నగర్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఓపీఎస్‌కు విద్యుద్దీపం, చిన్నమ్మ వర్గానికి టోపీని ఎన్నికల చిహ్నంగా కేటాయించింది. 
 
అయితే ఓపీఎస్ వర్గం, ఈపీఎస్ వర్గం ఒకే తాటిపై వచ్చాక.. చిన్నమ్మ వర్గాన్ని వారు పక్కనబెట్టారు. కీలక పదవుల నుంచి శశికళను, దినకరన్‌ను తప్పించారు. ఫలితంగా ఈసీ ఈపీఎస్, ఓపీఎస్ వర్గానికి షాక్ ఇస్తూ.. రెండాకుల చిహ్నాన్ని కేటాయించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విదేశీ వుద్యోగమని వెళ్లాడు, సింగిల్ కిడ్నీతో తిరిగొచ్చాడు... ఏమైందంటే?

నిరుద్యోగులు, ఆర్థికంగా దెబ్బతిని ఇబ్బందులు పడేవారిని లక్ష్యం చేసుకుంటూ జరిగే నేరాలలో ...

news

రైలులో పాము-కొట్టి చంపిన యువకుడు (video)

రైలులోకి పాము ప్రవేశించింది. అంతే ప్రయాణీకులందరూ జడుసుకుంటున్నారు. ఆ పాము గురించి రైల్వే ...

news

రేవంత్ రెడ్డి, చంద్రబాబు జైలుకు వెళ్ళాల్సిందే: టీఆర్ఎస్ విప్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటీవలే ...

news

లక్ష్మీపార్వతి నన్ను చంపేస్తానంటోంది... దర్శకుడు కేతిరెడ్డి

వైసిపి నేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య లక్ష్మీపార్వతి చరిత్రపై ...

Widgets Magazine