Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మందు పార్టీకి పిలవలేదని గొడవ.. ఫ్రెండ్‌ను చంపి తలను వేరు చేసిన స్నేహితులు

శుక్రవారం, 5 జనవరి 2018 (10:49 IST)

Widgets Magazine
murder

మద్యంమత్తులో నలుగురు యువకులు కలిసి తమ స్నేహితుడిని హత్య చేశారు. ఆ తర్వాత తల, మొండెంలను వేరు చేసి, తలను ఒకచోట, మొండెంను మరోచోట పూడ్చిపెట్టారు. ఈ దారుణం డిసెంబర్ 31వ తేదీ రాత్రి తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లా కేంద్రంలోని భారతి మార్కెట్‌ ప్రాంతానికి చెందిన మ‌దియళగన్‌, సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్‌లు మంచి స్నేహితులు. వీరంతా కలిసి అప్పుడ‌ప్పుడు మందు పార్టీలు చేసుకునేవారు. ఈ క్రమంలో న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న రాత్రి స్థానిక‌ శ్మశానవాటిక ప్రాంతంలో సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ మందు పార్టీ చేసుకున్నారు. 
 
ఈవిషయం మదియళగన్‌ చెప్పలేదు. కానీ, ఈ విషయం తెలుసుకున్న మది.. పార్టీ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి వారిని నిల‌దీశాడు. దీంతో చెల‌రేగిన గొడ‌వ‌లో మ‌దియళగన్‌ బీర్‌ బాటిల్‌ తీసుకుని ఓ స్నేహితుడిని పొడవ‌డానికి య‌త్నించాడు. అప్పటికే పీకలవరకు మద్యం సేవించివున్న మిగిలిన స్నేహితులంతా క‌లిసి మదియళగన్‌ను కత్తితో పొడిచి చంపేశారు. 
 
అంతేకాదు... మదియళగన్‌ తలను శరీరం నుంచి వేరు చేశారు. అనంత‌రం తలని, మొండాన్ని ఓ కాలువ పక్కన గుంత తవ్వి పాతిపెట్టారు. త‌మ కుమారుడు క‌న‌ప‌డ‌కపోవ‌డంతో అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు మదియళగన్ స్నేహితులే అత‌డిని చంపేశార‌ని గుర్తించారు. ముదియ‌ళ‌గ‌న్ స్నేహితులు నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరొకరు మాత్రం ప‌రారీలో ఉన్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చైనా సైనికులను పరుగుపెట్టించిన ఇండియన్ ఆర్మీ

డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ...

news

ఈ జ్యోతి.. మరో స్వాతి.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది...

తెలంగాణ రాష్ట్రంలో మరో స్వాతి గుట్టు వెలుగు చూసింది. అయితే, ఈమె పేరు స్వాతి కాదు. జ్యోతి. ...

news

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ ...

news

బాబోయ్ పోలీసులు... యాంకర్ ప్రదీప్ పారిపోయాడా?

ఇదివరకు పోలీసు దుస్తుల్లో ఎవరయినా వ్యక్తి ఇంటి వైపు వస్తుంటే బెంబేలెత్తిపోయేవారు. ...

Widgets Magazine