గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (13:16 IST)

టాయ్‌లెట్ దానం చేయమంటున్న ఐఏఎస్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి టాయ్‌లెట్ దానం చేయండి అటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చ

ఆయన పేరు వీరేంద్ర మిట్టల్. 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2016 నుంచి ఆయన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అస్సాం రాష్ట్రంలోని జొర్హాట్‌ జిల్లాలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యంతో ఈయన పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా 'దాన్‌ టాయ్‌లెట్' నినాదం చేస్తూ మరుగుదొడ్ల నిర్మాణంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరీరాన్ని టాయ్‌లెట్‌ పవిత్రంగా ఉంచుతుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. దేవాలయం ఆత్మను పవిత్రం చేస్తే.. శరీరాన్ని టాయ్‌లెట్‌ పవిత్రంగా ఉంచుతుందని అంటూ ప్రజలకు వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
 
పేదలకు టాయ్‌లెట్‌ని దానం చేస్తే అంతకుమించిన దానం మరొకటి లేదని అంటున్నారు. దీనితో ‘దాన్‌ టాయ్‌లెట్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్లు స్పందించారు. మధ్యతరగతి ప్రజలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. జిల్లాలో ఓ వితంతువుకు మిట్టల్‌ స్వయంగా టాయ్‌లెట్‌ దానం చేశారు (కట్టించారు). ఆయన దారిలో అనేకమంది ప్రభుత్వ అధికారులు, వారి బంధువులు కూడా మరుగుదొడ్లు కట్టించి దానం చేశారు.