సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:24 IST)

ఫేమస్ ఆల్వార్ కచోరీ కోసం రైలును ఆపిన లోకో డ్రైవర్

ఓ లోకో డ్రైవర్ రాజస్థాన్‌లోని రైల్వే క్రాసింగ్‌ వద్ద కచోరీ ప్యాకేజ్‌ని కోసం రైలును ఆపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ మాటలు వినేందుకు, వీడియో చూసేందుకు వినోదభరితంగా ఉండొచ్చుగానీ, నిజంగానే రైలు డ్రైవర్ కచోరీ కోసం రైలును ఆపారు. ఆపడం వంటి అసాధారణ సంఘటన అతనికి వినోదభరితంగా ఉండకపోవచ్చు. 
 
ఆ తర్వాత ఆగిన రైలు వద్దకు ఓ వ్యక్తి వచ్చి కస్తకచోరీని అందిస్తాడు. ఆ తర్వాత రైలు బయలురేరి వెళుతుండి. ఈ తంతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇపుడు రైల్వే ఉన్నతాధికారులకు చేరింది. దీంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించి ఇద్దరు పైలట్లు, ఇద్దరు గేట్‌కీపర్లు, ఒక ట్రైనర్‌ను సస్పెండ్ చేశారు.