Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఎలా ఇవ్వాలో అర్థంకావట్లేదు : అరుణ్ జైట్లీ

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (17:13 IST)

Widgets Magazine
arun jaitley - ap map

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ప్రత్యేక హోదా స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంగళవారం పార్లమెంట్ ఉభయసభలూ స్తంభించిపోయాయి. 
 
దీనిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో స్పందిస్తూ, ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.3,990 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో రావాల్సిన నిధులను ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఎలా ఇవ్వాలన్నదే ప్రధాన అంశమని, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ)ల ద్వారా ప్రత్యేక హోదా లోటును భర్తీ చేస్తామని అన్నారు. 
 
ఈఏపీలపై జనవరి 3వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు ఒక లేఖ రాశారని, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు కేటాయించాలని బాబు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు ఇవ్వాలంటే సమస్య ఎదురవుతోందని, ఆవిధంగా నిధులిస్తే రాష్ట్ర రుణ సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మిస్టర్ జైట్లీ.. ఏదైనా వుంటే సీఎంతో మాట్లాడండి : సుజనా చౌదరి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఘాటుగానే ...

news

ఢిల్లీలో ఏపీ సెగలు : జైట్లీకి - వెంకయ్యలకు టీడీపీ షాక్.. మోడీతో రాజ్‌నాథ్

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడులకు తెలుగుదేశం ...

news

తాళికట్టే సమయానికి ఆ నిజం తెలిసింది.. వరుడు ఏం చేశాడంటే?

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం ...

news

శివ శివా... విద్యార్థినిపై శివాలయంలో గ్యాంగ్ రేప్

కామంతో కళ్ళు మూసుకునిపోయిన కామాంధులకు బడి, గుడి అనే తేడాలేకుండా పోతోంది. తాజాగా ఓ ...

Widgets Magazine