కోడిగుడ్డుకూర వండలేదని గన్‌తో భార్యను కాల్చేసిన భర్త

శనివారం, 14 జులై 2018 (14:58 IST)

ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వండలేదని భార్యను ఓ భర్త తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ జిల్లాలోని దేవదాస్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల నవనీత్-మంగేశ్ శుక్లాకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. నవనీత్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 
 
అయితే నవనీత్ తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం తప్పతాగి ఇంటికొచ్చాడు. కోడిగుడ్డు కూర వండాలని భార్యకు చెప్పాడు. కానీ కోడిగుడ్డుకూర వండేందుకు భార్య నిరాకరించడంతో నవనీత్‌ కోపంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న నవనీత్ ఇంట్లోకి వెళ్లి తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌ను తీసుకువచ్చి భార్య శుక్లాపై కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో గాయపడిన శుక్లాను స్థానికులు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై శుక్లా సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేను వుండగానే టీనేజ్ అమ్మాయితో నా భర్త రాసలీలలు... ఎమ్మెల్యే భార్య ఆరోపణ

భాజపాకు చెందిన జమ్ము-కాశ్మీర్ ఎమ్మెల్యే గగన్ భగత్ భార్య అతడిపై ఆరోపణలు చేసింది. ...

news

అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదు: వసీం రిజ్వీ సెన్సేషనల్ కామెంట్స్

అయోధ్యలో వున్నది మసీదు కాదని.. అది రామ జన్మభూమి అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ...

news

27న బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం.. అరుదైన దృశ్యం ఆవిష్కృతం

దేశంలో ఈ నెల 27న ఈ శతాబ్ధంలోనే అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. 2000 సంవత్సరం జులై ...

news

నారా లోకేశ్ అడిగితే నా సీటు ఇచ్చేస్తా.. చంద్రబాబుపై కృష్ణంరాజు ప్రశంస

మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని ...