మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (14:37 IST)

రెండేళ్ళ బాలికను చంపి తినేసిన వీధి కుక్కలు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలకు, యువతులకు కామాంధుల నుంచే కాదు.. వీధి కుక్కల నుంచి రక్షణ లేకుండా పోయింది. రెండేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చంపి తినడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోదీనగర్ మున్సిపాలిటీలోని భీంనగర్‌లో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన విషయాలను పరిశీలిస్తే..
 
భీంనగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో వీధి కుక్కల మంద ఇంట్లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న చిన్నారిపై దాడి చేశాయి. పిమ్మట చిన్నారిని నోటకరచుకుని సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి తినేశాయి. ఈ విషయాన్ని మోదీనరగ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పవన్ అగర్వాల్ వెల్లడించారు.
 
ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు మోదీనగర్ మున్సిపాలిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధికుక్కలు బాలికను చంపి తిన్న ఘటన నేపథ్యంలో వాటిని పట్టుకోవాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వీధికుక్కల నివారణకు శ్రీకారం చుట్టారు.