శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:41 IST)

ఉరిశిక్షపై తీర్పు ఇచ్చాక పెన్నుపాళీని ఎందుకు విరిచేస్తారు?

భారతీయ శిక్షాస్మృతిలో ఉరి అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తర్వాత జడ్జి తన పెన్ను పాళీ(నిబ్)ని విరిచేస్తారు. ఈ దృశ్యం చాలా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇలాచేయడం వెనుక రాజ్యాంగంతో ముడిపడ

భారతీయ శిక్షాస్మృతిలో ఉరి అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తర్వాత జడ్జి తన పెన్ను పాళీ(నిబ్)ని విరిచేస్తారు. ఈ దృశ్యం చాలా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇలాచేయడం వెనుక రాజ్యాంగంతో ముడిపడిన ఒక కారణం ఉందట. 
 
ఒకసారి నిర్ణయం లిఖించిన తర్వాత జడ్జికి సైతం ఈ నిర్ణయాన్ని మార్చేందుకు అధికారం ఉండదు. దీనికితోడు జడ్జి చేతుల మీదుగా ఒక జీవితానికి ముగింపు పలికిన పెన్ను... మరోమారు వినియోగించేందుకు ఉపకరించదట. అందుకే ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పు రాసిన పెన్ను పాళీని జడ్జి విరిచేస్తారట.