Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఢిల్లీ లిక్కర్ మాఫియా దాష్టీకం : మహిళ నగ్న ఊరేగింపు

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:49 IST)

Widgets Magazine
dcw woman

ఢిల్లీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. తమ గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం చేరవేసిందన్న కోపంతో ఓ మహిళను చితకబాది, వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ పోలీస్‌ చౌకీ సమీపంలో మహిళ ప్రవీణ్ అనే మహిళ నివసిస్తోంది. ఈమె ఢిల్లీ మహిళా సంఘంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. అయితే, నారెళ్లలో చట్టవ్యతిరేకంగా లిక్కర్‌ అమ్ముతుండటాన్ని పసిగట్టిన ఆమె.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఢిల్లీ మహిళా కమీషన్‌కు చేరవేసింది. 
 
దీంతో వారు దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే ఆ మాఫియాకు చెందిన ఓ మహిళ కొందరు పురుషులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్‌పై గురువారం దాడికి తెగబడ్డారు. ఆమెను చితకబాది, వివస్త్రను చేసి నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. 
 
ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్‌తో పాటు.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్‌ శాఖకు నోటీసులు జారీ చేసింది.
 
అలాగే, సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబుది తల్లి టీడీపీ-జనసేన పిల్ల టీడీపీ: రోజా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విమర్శలు ...

news

పెళ్లి తర్వాత మతం మారదు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

మతాంతర వివాహం చేసుకున్న మహిళకు పెళ్లి తర్వాత ఆమె మతం మారదనీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ...

news

ఇజ్రాయేల్ రాజధాని జెరూసలెం: భారత్ ప్రకటన ఇదే

ఇక నుంచి ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుందని అమెరికా అధ్యక్షుడు ...

news

బీ-ఫామ్ వేలిముద్రలకు నేనే సాక్షి : ప్రభుత్వ వైద్యుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం ఓ మిస్టరీ. అలాగే, ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స ...

Widgets Magazine