Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి తర్వాత మతం మారదు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (11:38 IST)

Widgets Magazine
supreme court

మతాంతర వివాహం చేసుకున్న మహిళకు పెళ్లి తర్వాత ఆమె మతం మారదనీ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంటే వివాహం తర్వాత భర్త మతమే ఆమెకు వర్తిస్తుందని తెలిపే చట్టాలేమీలేవని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ఇతర మతానికి చెందిన వ్యక్తిని.. గూల్రోఖ్‌ ఎం.గుప్తా అనే పార్శీ మహిళ వివాహం చేసుకుంటే ఆమె మతాన్ని కోల్పోతుందా? అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న పార్శీ మహిళ తన మతాన్ని కోల్పోయి, భర్త మత విశ్వాసాలకు చెందిన వ్యక్తి అవుతుందని 2010లో గుజరాత్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇజ్రాయేల్ రాజధాని జెరూసలెం: భారత్ ప్రకటన ఇదే

ఇక నుంచి ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా గుర్తించనుందని అమెరికా అధ్యక్షుడు ...

news

బీ-ఫామ్ వేలిముద్రలకు నేనే సాక్షి : ప్రభుత్వ వైద్యుడు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం ఓ మిస్టరీ. అలాగే, ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స ...

news

చంద్రబాబు ఆస్తులు రూ.2.53 కోట్లు... దేవాన్ష్ ఆస్తులు రూ.11.54 కోట్లు : మంత్రి లోకేష్

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను ఆయన ...

news

ఆస్ట్రేలియాలో భార్యను వేధించాడు.. హైదరాబాదులో అరెస్టయ్యాడు..

విదేశాల్లో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి డబ్బుకు కక్కుర్తి పడి కట్టుకున్న భార్యనే అదనపు కట్నం ...

Widgets Magazine