నవరాత్రి తొలి రోజు.. జీడిపప్పు హల్వాను నైవేద్యంగా పెడితే?

సోమవారం, 18 సెప్టెంబరు 2017 (16:17 IST)

నవరాత్రుల్లో తొలిరోజు జీడిపప్పుతో హల్వాను నైవేద్యంగా సమర్పించుకోవాలి. నవరాత్రులు ప్రారంభమయ్యే తొలి రోజున శైలపుత్రీ దేవిని పూజించాలి. ఆ రోజున అమ్మవారికి జీడిపప్పు హల్వా, పూరీ, సజ్జతో అప్పాలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం, బియ్యం రవ్వతో చేసిన పాయసం సమర్పించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. వీటిలో జీడిపప్పుతో హల్వా ఎలా చేయాలంటే?
 
కావలసిన పదార్ధాలు: జీడిపప్పు-150 గ్రాములు, 
యాలకలు - 5, 
పాలు - ఒక లీటరు,
పంచదార - 200 గ్రా, 
మిఠాయి కలర్ - చిటికెడు.
 
తయారీ విధానం: ముందుగా జీడిపప్పులను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక లీటరు పాలు స్టౌమీద పెట్టి బాగా మరిగేటప్పుడు మనం ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న జీడిపప్పు ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.
 
స్టౌమీద పాలలో ఉడికే జీడిపప్పుకు పంచదారను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా గట్టిపడేదాకా స్టౌమీద ఉడికించాలి. అలా గట్టిగా ముద్దగా తయారైన తర్వాత మిఠాయి కలర్‌ను, ఏలకుల పొడిని వేసి బాగా కలుపుకుని దించేసుకుంటే జీడిపప్పు హల్వా రెడీ. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్‌లో రోల్స్‌లా తయారు చేసుకోవచ్చు. దీనిపై మరింత చదవండి :  
Navaratri Special ​cashew Halwa Recipe Kaju Ka Halwa Recipe

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శరన్నవరాత్రులు- నైవేద్యాలు

శరన్నవరాత్రులను దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటారు. దసరా పండుగ కోసం పది రోజుల పాటు ...

news

ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానప్రాప్తి... (వీడియో)

చిత్తూరు జిల్లా ప్రముఖ ఆలయాలకు పెట్టింది పేరు. తిరుపతికి సరిగ్గా 35 కిలోమీటర్ల దూరంలో ...

news

శ్రీవారి ఆకలి తీర్చిన శ్రీలక్ష్మి, కానీ భూదేవి...

పురాణ గ్రంథాలలో శ్రీ వేంకటేశ్వర ఇతిహాసం ప్రకారం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు భూలోక ...

news

శ్రీవారి క్యాలెండర్లు - డైరీలపై జీఎస్టీ ప్రభావం... పెరిగిన ధరలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటోలతో టీటీడీ బోర్డు ముద్రించే వార్షిక క్యాలెండర్లు, డైరీలకు ...