శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (08:39 IST)

మంగళవారం దినఫలాలు .. కార్తికేయుడిని పూజించినా శుభం

మేషం : బ్యాంకింగ్ రంగాలలోని వారికి అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. వ

మేషం : బ్యాంకింగ్ రంగాలలోని వారికి అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీయాన యత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు.
 
వృషభం : గతంలో ఇచ్చిన హామీకి వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకొంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చికాకులు కలిగిస్తాయి. పాతబిల్లులు చెల్లిస్తారు.
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, పునఃపరిశీలన ముఖ్యం. చెల్లింపులు, చెక్కుల జారీలో మెలకువ వహించండి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ది.
 
కర్కాటకం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, గృహంలో మార్పులు అనుకూలించవు. రాజకీయాలలోని వారు మాటపడక తప్పదు. విద్యార్థులు ఏకాగ్రత వల్ల మంచి గుర్తింపు పొందుతారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ది కానరాగలదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి.
 
సింహం : మీ ఏమరపాటుతనం వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. విద్యార్థులు విదేశీ ప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు, చేబదుళ్ళు తప్పవు.
 
కన్య : దైవ కార్యక్రమాల పట్ల చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు పనివారితో ఏకీభావం కుదరదు. ప్రేమికులకు మధ్య విభేదాలు తొలిగిపోతాయి. కంది, మినుము, పెసర, నూనె వ్యాపారస్తులకు సాకిస్టులకు పురోభివృద్ధి. మీరు కోరుకుంటున్న వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. బంధుమిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు.
 
తుల : మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధి చేయు కృషి సఫలీకృతులవుతారు. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. కొంత మందిమీ మాటను వక్రీకరించే అవకాశం ఉంది. జాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు అధికారులతో మెళుకువ అవసరం.
 
వృశ్చికం : విద్యార్థులు చంచల స్వభావం విడనాడి కృషిచేసినా సఫలీకృతులవుతారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్ధంగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు.
 
ధనస్సు : బంధువులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. విద్యార్థులు మొండివైఖరి అవలంబించుట వల్ల మాటపడక తప్పదు. కోర్టు వ్యవహారాలలో లాయర్లు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మిత్రులలో వచ్చిన మార్పు మీకెంతో నిరుత్సాహం, ఆందోళనలు కలిగిస్తుంది.
 
మకరం : చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకోవటం మంచిది. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు, వ్యవసాయ దారులకు ఆందోళన కలిగిస్తుంది.
 
కుంభం : విద్యార్ధుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు సంతృప్తినిస్తాయి. మిమ్మల్ని కొంతమంది ఆర్ధిక సాహయం అర్ధించవచ్చు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సహకార సంఘాల్లో వారికి, ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
మీనం : రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. పూర్వపు పరిచయ వ్యక్తుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆర్ధిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి.