నేటి దినఫలాలు.. గణపతిని ఆవుపాలతో అభిషేకిస్తే..

బుధవారం, 6 డిశెంబరు 2017 (06:18 IST)

daily astro

మేషం : స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహనాలోపం వంటివి ఉండగలవు. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. 
 
వృషభం : ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యం. రావలసిన ధనం అందడంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. 
 
మిథునం : ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభ, పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. 
 
కర్కాటకం : పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఎన్ని అవరోధాలు తలెత్తినా వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. 
 
సింహం : చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టులతో శ్రమించి సఫలీకృతులవుతారు. ఒక విషయంలో బంధువుల నైజం బయటపడుతుంది. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
కన్య : ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల : లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టరుల విషయంలో పునరాలోచన అవసరం. మొక్కుబడులు తీర్చుకోవాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీలకు విలాసాలు, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేక పోతారు. 
 
వృశ్చికం : వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను అధికమిస్తారు. రావలసిన ధనం చేతికందడంతో ఆర్థికంగా కుదుటపడతారు. పాతమిత్రుల కలయికతో మీలో పలుఆలోచనలు చోటుచేసుకుంటాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ సంతానం ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణం చేయలవలసి వస్తుంది. 
 
ధనస్సు : వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. శ్రమించిన కొలదీ ఫలితం అన్నట్టుగా ఉంటుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. ఆహార వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, చెల్లింపులలోనూ అప్రమత్త అవసరం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. సోదరులతో మనస్పర్థలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
కుంభం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు. విద్యార్థుల్లో మందకొండితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి. 
 
మీనం : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎన్ని అవరోధాలు తలెత్తినా వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులు తోటివారి సహకారం వల్ల గుర్తింపు, లాభం పొందుతారు. దీనిపై మరింత చదవండి :  
December 6 Today Astro Daily Astrology Today Prediction Daily Prediction Daily Horoscope Prediction

Loading comments ...

భవిష్యవాణి

news

మంగళవారం దినఫలాలు .. కార్తికేయుడిని పూజించినా శుభం

మేషం : బ్యాంకింగ్ రంగాలలోని వారికి అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.ఉద్యోగస్తులు ...

news

సోమవారం దినఫలితాలు : స్త్రీలకు ధనలాభం...

మేషం : కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీలకు ధనలాభం, పుణ్యక్షేత్రా సందర్శన ...

news

ఆదివారం దినఫలాలు... నేర్పులకిది పరీక్షా సమయం..

మేషం : వృత్తి, ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ది సాధిస్తారు. రాబడికి మించిన ఖర్చులు, ...

news

శనివారం రాశి ఫలితాలు... ఇలా వున్నాయి...

మేషం : ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం ...