Widgets Magazine

మంగళవారం మీ రాశిఫలితాలు.. అలా చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి

మేషం: ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పె

daily astro
raman| Last Updated: మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (08:49 IST)
మేషం: ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన పురోభివృద్ధి ఉండదు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ఉపాధ్యాయులు నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరగలదు. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.

వృషభం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. రిప్రజెంటివ్‌లు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలు అపరిచితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునం: దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ప్రతిపని చేతిదాకా వచ్చి వెనక్కిపోవడం వల్ల నిరుత్సాహం, ఆవేదనకు లోనవుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొనవలసివస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.

కర్కాటకం: ప్రైవేట్ సంస్థల్లో వారికి పారిశ్రామిక రంగంలో వారికి పనివారితో సమస్యలు తప్పవు. ఖర్చులకు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. బంధుమిత్రులకు మీపై మరింత అభిమానం కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంగారం, వాహనం ఇత్యాది విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

సింహం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు వుంటాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం.

కన్య: లైసెన్సుల రెన్యువల్, లీజు పొడిగింపుల్లో అశ్రద్ధ తగదు. మీ సంతానం కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది.

తుల: గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు మరింతగా కృషి చేయవలసి వుంటుంది. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.

ధనస్సు: విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఫ్యాన్సీ, బంగారం, వెండి, లోహ, రత్న వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులతో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
మకరం: వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒప్పందాలు, హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

కుంభం: దైవ, శుభకార్యాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. చేతివృత్తులవారికి సదవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
మీనం: వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించడంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది.

అన్ని రాశులవారు ఎర్రనిపూలతో కార్తికేయుడిని పూజించినా వారివారి మనోవాంఛలు నెరవేరుతాయి.


దీనిపై మరింత చదవండి :