Widgets Magazine

ఫిబ్రవరి 11న మీ రాశి ఫలితాలు.. స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసిస్తే...

మేషం : కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినాల్సివస్తుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి

daily astro
raman| Last Updated: ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (10:23 IST)
మేషం : కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినాల్సివస్తుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో కొంత చికాకులను ఎదుర్కొంటారు.
వృషభం: ఉపాధ్యాయుల విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు పనిభారం అధికం. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు.

మిథునం :స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. స్థిరచరాస్తుల విషయంలో కుటుంబీకుల మధ్య ఏకీభావం కుదరదు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
కర్కాటకం: తరచు విందులు వంటి శుభ సంకేతాలున్నాయి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ సహాయ సహకారాలు అర్థిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి.

సింహం: బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల పట్ల ఏకాగ్రత వహించవలసి వుంటుంది. దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి.
కన్య: స్త్రీలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రుణం తీర్చటానికై చేయు యత్నం వాయిదా పడుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో సఫలీకృతులు కాగలరు.

తుల: తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. వ్యాపార రీత్యా దూర ప్రయాణం చేయవలసివస్తుంది. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమికులకు నిరుత్సాహం, ఎడబాటు తప్పవు. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. ఆత్మీయుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
వృశ్చికం: సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలకు చక్కని పరిష్కార మార్గం స్ఫురిస్తుంది. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లడంతో ఒత్తిడి, చికాకులు మందలింపులు అధికమవుతాయి. ఇంటా, బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు.

ధనస్సు: సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించడం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది.
మకరం: స్త్రీలకు గృహ వాతావరణం, సంతానం వైఖరి వల్ల చికాకులు తప్పవు. మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఏకాగ్రత వహించలేరు.

కుంభం: ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ నిర్ణయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనతప్పదు.
మీనం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాబడికి మించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పవచ్చు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఆహార విషయంలో వేళ తప్పి భుజించడం వల్ల ఆరోగ్య భంగం. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు.


దీనిపై మరింత చదవండి :