సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (10:13 IST)

ఆదివారం (29-04-2018) దినఫలాలు - కొత్త సమస్యలు తలెత్తుతాయి..

మేషం: రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. విద్యుత

మేషం: రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. విద్యుత్ రంగాల వారికి అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధిమవుతాయి.
 
వృషభం: స్త్రీలకు అయిన వారిని చూడాలనే కోరిక స్ఫురిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు. కోపంతో పనులు చక్కబెట్టలేరు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ముఖ్యమైన వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. ప్రేమికుల తొందరపాటుతనం అనర్ధాలకు దారితీస్తుంది.
 
మిధునం: భాగస్వాముల మధ్య అవరోదాలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఇతరుల విషయాలకు వీలైనంత దూరంగా ఉండటం క్షేమదాయకం. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
కర్కాటకం: ఒక అనుభవం మీకెంత జ్ఞానాన్ని ఇస్తుంది. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలువాయిదా పడటం మంచిది. ఎ.సి. కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు విశ్రాంతి లోపం, వేళతప్పి భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. 
 
సింహం: మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. నెలసరి వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీల వాక్ చాతుర్యంనకు, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
కన్య: బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీయాన యత్నాల్లో జాప్యం తప్పదు. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. క్రీడా, కళా, సాంస్కతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. 
 
తుల: మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. 
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. శాంతియుతంగా మీ సమస్యలు పరిష్యరించుకోవాలి. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత అవసరం.
 
ధనస్సు: విద్యార్థులు క్రీడా రంగాలపట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల అధికమవుతాయి. విదేశాలలోని క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మకరం: మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దలను బాగుగా గౌరవిస్తారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. రవాణా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం: ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను నిలబెట్టు కోవడానికి ఎంతైనా పోరాడతారు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఏ విషయంలోను ఒంటేత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వటం మంచిదికాదు. 
 
మీనం: దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. మీ పాత సమస్యలు పరిష్కరించబడతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఆత్మీయుల నడుమ విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ప్రయాణాలకు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఒక వ్యవహారంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు.