Widgets Magazine

ఆదివారం (10-06-18) దినఫలాలు - స్త్రీలకు పనిభారం...

మేషం: రాజకీయనాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులక

astrology
raman| Last Updated: ఆదివారం, 10 జూన్ 2018 (09:46 IST)
మేషం: రాజకీయనాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.
వృషభం: నిర్మాణ పథకాలలో మెళకువ వహించండి. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. కొత్త రుణాలకు ప్రయత్నాలు చేస్తారు.

మిధునం: ప్రత్యర్ధులు సైతం వీరి ఔనత్యాన్ని గుర్తిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులకు విభేదాలు తలెత్తగలవు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వైద్యులకు పేరు, ఖ్యాతి లభిస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. దూరప్రయాణాలలో మెళకువ వహించండి. బంధువుల రాక వలన ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోగలరు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. స్పెకులేషన్ నిరాశపరుస్తుంది.
కన్య: మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టండి. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. ఒక కార్యక్రమం మీకు అనుకూలంగా మారుతుంది. మీ సంతానంలో మార్పుకానరాగలదు. పారిశ్రామిక రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు.

తుల: ఆర్థిక ఇబ్బంది అంటూ లేక పోయిన సంతృప్తి వుండజాలదు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడటం మంచిది. తలపెట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. విద్యార్థులు ఉన్నత విద్యలకోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం.
వృశ్చికం: విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత అవసరం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నం వాయిదా పడటం మంచిది. వృత్తుల్లో వారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చుచేస్తారు.

ధనస్సు: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. నిరుద్యోగులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరీసోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదవకాశాలు లభించగలవు. స్త్రీలకు పని ఒత్తిడి వలన ఆరోగ్యంలో ఒత్తిడి, చికాకులు తప్పవు.

మకరం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. విందులు, దైవ కార్యాలలో పాల్గొంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. బంధుమిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది.

కుంభం: మీ కుటుంబీకుల మెుండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. అపరిచితుల పట్ల మెళకువ వహించండి. నూతన వ్యాపారాలు, పరిశ్రమల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

మీనం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. ముఖ్యులకోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ప్రేమాను బంధాలు, నూతన పరిచయాల మరింత బలపడతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.


దీనిపై మరింత చదవండి :