Widgets Magazine

మంగళవారం (12-06-2018) దినఫలాలు - స్త్రీలకు ఆపద సమయంలో..

మంగళవారం, 12 జూన్ 2018 (08:42 IST)

Widgets Magazine
astrology

మేషం: ఆర్థికలావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. మీ సంతానం విద్యావిషయాలు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీలకు ఆపదసమయంలో అయినవారి సహాయసహాకారాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృషభం: ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఆందోళన కలిగిస్తాయి. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. ఉద్యోగస్తులు తరుచు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. గత కాలంగా వేధిస్తున్నన సమస్యలు ఒక కొలిక్కివస్తాయి.
 
మిధునం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
కర్కాటకం: వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. రావలసిన ధనం మెుత్తం చేతికందుతుంది. వాణిజ్య ఒప్పందాలు, నూతన కాంట్రాక్టుల విషయంలో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు అలంకరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. 
 
సింహం: ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి మానసికంగా ఆందోళన చెందుతారు. రిప్రజెంటేటివ్‌లకు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. పండితుల ప్రోత్సాహం లభిస్తుంది.
 
కన్య: ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొవలసివస్తుంది. 
 
తుల: ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. విద్యార్థులకు సంతృప్తి కానరాదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బంధువర్గంతో వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు. ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. టెక్నికల్ కంప్యూటర్ రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు.
 
వృశ్చికం: అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ఆస్థి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు, అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోవారికి పురోభివృద్ధి. 
 
ధనస్సు: విద్యుత్, ఎ.సి. మెకానికల్ రంగాలలోనివారికి సంతృప్తి కానవస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారస్థులకు ప్రభుత్వ అధికారుల నుండి సమస్యలను ఎదుర్కుంటారు. క్రయవిక్రయ రంగాలవారికి అనుకూలమైన కాలం. తలపెట్టిన పనులు కొంత మందగిస్తాయి. రుణ ఒత్తిడి నుంచి బయటపడుతారు. 
 
మకరం: స్త్రీల రచనలకు, కళాత్మతకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ధనాభివృద్ధి కాన వచ్చినా ధనం ఏ మాత్రం నిల్వచేయలేరు. సినిమా, విధ్యా, సాంస్కృతిక, కళారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. వాహన చోదకులకు మెళకువ అవసరం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
 
కుంభం: బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన విషయంలో సంతృప్తి కానరాదు. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తతెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
 
మీనం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోవారికి పురోభివృద్ధి. ధాన్యం, అపరాలు, నూనె రిటైల్ వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయాలలోవారు విరోధులు వేసే పథకాలను తెలివితో త్రిప్పిగొట్టగలుగుతారు. ఋణానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రాశిచక్రం దినఫలాలు భవిష్యవాణి ఆస్ట్రాలజీ Daily Horoscope Daily Predictions Daily Astrology Today Astro

Loading comments ...

భవిష్యవాణి

news

తిరుమల వెంకన్నకు ఏడు వత్తులతో ఇలా దీపమెలిగిస్తే..?

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు.. భక్తుల కొంగుబంగారం. కోరిన కోరికలను నెరవేర్చే ...

news

బ్రహ్మంగారి కాలజ్ఞానం- ఒకరి ఆలి మరొకరి పాలయ్యేను.. రాతి తేలు నడిచిపోవును?

ఒకరి ఆలి మరొకరి పాలయ్యేను (విడాకులు పొందిన స్త్రీ మరో వివాహం చేసుకోవడం) ...

news

జూన్ 27న వటసావిత్రి వ్రతం చేస్తే.. సౌభాగ్యం...

ఈ వ్రతం జ్యేష్ఠ పూర్ణమనాడు ఆచరిస్తారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజునే ప్రదోషకాలంలో ...

news

మీరు జూన్ 12, 21, 30 తేదీల్లో జన్మించారా?

మీరు జూన్ 12, 21, 30 తేదీల్లో జన్మించారా, అయితే ఉన్నత పదవులను అలంకరిస్తారని సంఖ్యాశాస్త్ర ...