ధ్యానం అనేది మానసిక శక్తిని...?

Last Updated: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (12:19 IST)
ధ్యానం జీవితంలో భాగమవ్వాలి. అయితే చాలామందికి ధ్యానం అంటే ఎక్కువగా తెలియదు. కళ్ళు మూసుకుని కూర్చుని ఉండడమే ధ్యానం అనుకునేవారూ లేకపోలేదు. కాని ధ్యానంలో పలు స్థాయిలున్నాయి.

ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి, శూన్యం... వంటివి ఉన్నాయి. ధ్యానం అనేది మానసిక శక్తిని అందించేది. సాధికారత కల్పించేది. శారీరక, మానసిక, భావోద్వేగాలకు ఒక స్పష్టమైన, మేలు కలిగించే రూపం ఇవ్వడం ధ్యానం ద్వారా సాధ్యం. క్రమంగా సాధనతో ధ్యానశక్తిని అందుకోగలుగుతారు. అందుచేత రోజూ ధ్యానానికి ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దీనిపై మరింత చదవండి :