Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య దీపం వెలిగిస్తే....

మంగళవారం, 3 అక్టోబరు 2017 (13:57 IST)

Widgets Magazine
Deepam

దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ఏర్పాటు చేసుకోవడం నుంచే ప్రారంభమవుతుంది. ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య వెలిగిస్తే ఆ ఇంటిలో అధిక సంపద, దేవుళ్ళ ఆశీర్వాదం, కుటుంబంలో శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. 48 రోజుల పాటు ప్రతిరోజు ఇలా వెలిగిస్తే మనోసిద్ధి కలుగుతుంది. అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి. 
 
సాయంత్రం 6 నుంచి 6.30 మధ్యలో దేవునికి దీపాలను వెలిగిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు.. ఉత్తమ జీవితం కావాలనుకునే వారు కుటుంబ సంతానాన్ని పొందుతారు. ఆ ఇంటిలోని వారందరికీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దీపంతో ప్రాథమికంగా రెండు ఒత్తులు వేయాలి. ఒత్తులు విడివిడిగా ఉండాలి. ఆ రెండు ఒత్తుల చివరలో మాత్రం కలిపి ఉండాలి. అలా కలిపి ఉండేలా తైలంతో కలిపి చుట్టాలి. ఆ తరువాత వెలిగించాలి.
 
ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి ఇది ప్రతీక. సాయంసంధ్యా దీపాన్ని ఇంట్లో వెలిగించే ముందు పూజా ప్రదేశంలో దేవుని ముందు ఒకటి, గుమ్మానికి గల దాలబందిరానికి చెరో మూలా వెలిగించాలి. ఏ ఆరాధనకు దీపం వెలిగించామో అది పూర్తయ్యే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. దీపారాధనను గణపతి ప్రార్థనతో ప్రారంభించి ఆరాధించాలి. ప్రధాన దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపం దేవుడికి ఎడమ వైపున, ఆవు నెయ్యితో వెలిగించిన దీపం దేవునికి కుడివైపున ఉండాలి. దీపారాధనకు ప్రమదిలో వెలిగించే ఒత్తి ఆగ్నేయ దిశగా ఉంటే ఎంతో శుభకరం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శిలా మూర్తికి శిరసా నమామి..!

తిరుమల క్షేత్రం... కలియుగ వైకుంఠం. తిరుమల కొండల్లోని చెట్టూ, పుట్టా... రాయీ, రప్ప... ఆ ...

news

కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే మంచిదే...

కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం. జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయంతో అనేక ...

news

స్వామీ... మా ప్రభుత్వాన్ని కాపాడంటున్న పన్నీర్ సెల్వం (Video)

తిరుమల శ్రీవారిని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ...

news

మరో వివాదానికి తెరలేపిన రమణ దీక్షితులు...

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరో వివాదానికి తెరలేపారు. తితిదే ...

Widgets Magazine