Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివుని గుడిలో ఆ సమయంలో ఒక్క దీపం వెలిగిస్తే కుబేరులే...

శుక్రవారం, 12 జనవరి 2018 (22:37 IST)

Widgets Magazine
Kubera

కుబేరుడు డబ్బుకు, సంపదకు, సకల ఐశ్వర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఖచ్చితంగా ఇస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితో పాటు కుబేరుని విగ్రహాలను చిత్రపటాలను చాలామంది పూజిస్తారు. అయితే నిజానికి కుబేరుడు అంతకుముందు దొంగ. శివపురాణంలో కుబేరుడు దొంగ అని చెప్పబడింది.
 
గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాత జన్మలో దేవుడుగా మారడం నిజంగా విచిత్రమే. కుబేరుడు పూర్వజన్మలో చాలా పేదవాడు. అతని పేరు గొన్నిధి. ఒకానొక దశలో తినడానికి తిండి కూడా లభించలేదు. దీంతో కుబేరుడు దొంగగా మారాడు. అయితే ఒకసారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు ఇతర ఆభరణాలు ఉండడాన్ని గొన్నిధి చూశాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగిలించాడని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడు పెద్ద ఎత్తున గాలివీచిందట.
 
దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోతున్న విషయాన్ని గుర్తించిన గొన్నిధి(కుబేరుడు) ఆ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా దీపం వెలుగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసిగిపోయి తన చొక్కాను తీసి మంటపెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి శివుడు సంతోషించి గొన్నిధి ఎదుట ప్రత్యక్షమవుతాడు. 
 
అంతేకాదు గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షకుడుగా ఉంటాడు. కుబేరుడికి గత జన్మలో జరిగినట్లుగా శివుని ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి. సాయంత్రం వేళ దీపం పెట్టి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దీంతో సమస్యలన్నీ తొలగిపోతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

సంక్రాంతి పురుషుడు మీ ఇంటికొస్తున్నాడు...

సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినది మొదలు తులారాశివరకు ఒక కాలం... దీనినే దేవతలకు పగలు ...

news

దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు... సాయిబాబా సూక్తులు..

1. నాపై నీ దృష్టి నిలుపు. నీ పైన నా దృష్టి నిలుపుతాను. 2. గురువును సంపూర్ణంగా.. అంటే ...

news

శ్రీవారి భక్తులకు తీపికబురు... కోరినన్ని లడ్డూలు

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకూ రెండు ...

news

పాము, ముంగిస, నెమలి అక్కడ ఆడుకుంటూ కనిపించాయి...

తండ్రీతనయులు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం ...

Widgets Magazine