Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టెంకాయ కొట్టిన తరువాత ఆ ఒక్కటి అందులో వేసి నైవేద్యం పెడితే..

సోమవారం, 8 జనవరి 2018 (16:13 IST)

Widgets Magazine
coconut

 
కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ చేశాక కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్ధతి, ఆచారం. పూజ పూర్తయిన తరువాత టెంకాయ కొట్టేశాం, నైవేద్యం పెట్టేశాం, తంతు పూర్తయింది అని అనుకుంటూ ఉంటాం. అంతా బాగానే ఉంది. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్ధతి ఉంది. 
 
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్ట నాశకం. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. టెంకాయ కొట్టేటప్పుడు స్వచ్ఛమైన నీటితో కడిగి ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశంలో పట్టుకోవాలి. టెంకాయ కొట్టేటప్పుడు ఆ రాయి ఆగ్నేయ దిశగా ఉండాలి. కాయి కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తు నుంచి కొట్టడం మంచిది. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అంటారు. కొంచెం అటు, ఇటూ అయినా ఫర్వాలేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అనుక్కోనక్కర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరుగవు. అలా జరిగిన సమయంలో శివాయ నమహ అంటూ 108 సార్లు జపించాలి. 
 
కొంతమంది టెంకాయ కొట్టినా రెండు చిప్పలు చేతితో పట్టుకుని పూజ చేస్తుంటారు. అలా చేయకూడదు. అలాగే టెంకాయను కొట్టి ఒక గ్లాసులో ఆ నీటిని తీసుకొని వేరుగా ఉంచాలి. పాత్రలోని కొబ్బరి నీటితో మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఇలా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించేటప్పుడు పంచదార వేసి నైవేద్యంగా సమర్పిస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

చేతిలో డబ్బులు నిలవాలంటే... ఇదొక్కటే మార్గం...

డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. ...

news

అమ్మాయీ... నువ్వు కార్చిన కన్నీటి బిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తాయి...

అకంపనుడనే రాజుకి ఒకప్పుడు శత్రువులతో యుద్ధం వచ్చింది. అతను శత్రువుల చేతిలో పట్టుబడేసరికి ...

news

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం..?

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం ...

news

వెంకన్న ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల గిరుల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తజనకోటి కోట్లాది రూపాయలను కానుకలుగా ...

Widgets Magazine