సొంతిళ్ళు సంపాదించడం చాలా ఈజీ... ఇలా చేయండి!

మంగళవారం, 15 ఆగస్టు 2017 (15:11 IST)

Lord Venkateswara

ప్రతి కుటుంబానికి సొంతిళ్ళు ఒక కల. కష్టించిన డబ్బుతో ఇళ్ళు కట్టుకోవాలనో.. కొనుక్కోవాలనో అనుకుంటుంటాం.. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడకపోవచ్చు. కష్టానికి దైవం తోడైతే ఖచ్చితంగా నెరవేరుతుందట. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ప్రతి శనివారం తూచా తప్పకుండా పూజిస్తే ఖచ్చితంగా సొంత ఇంటిని పొందవచ్చునంటున్నారు పండితులు.
 
శనివారం వ్రతమాచరించి శ్రీవారిని పూజించే వారికి సొంత ఇల్లే కాదు.. అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. శనివారం స్వామివారికి వ్రతం చేసే సమయంలో వెండితో చేసిన ఇంటినికానీ లేకుంటే అంతస్థోమత లేకుంటే మట్టితో చేసిన ఇంటిని కానీ ఇస్తామని శ్రీవారిని వేడుకోవాలట. ముందుగానే అలాంటి ప్రతిమను చేసుకొని ఇంటిలోని పూజ గదిలో ఉంచి ఉత్తర దిక్కున పెట్టుకోవాలి. ఆ ఇంటిని ప్రతి శనివారం పువ్వులు, అక్షింతలు వేసి ఆ ఇంటిలో దీపం వెలిగించి పూజించాలట. 
 
స్వామివారికి అలా పూజిస్తే తప్పక ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పూజగదిలోని ఇంటి ప్రతిమ ముందు 5 పిడికెల బియ్యం, పాలు, బెల్లం వీటిని ఉండలా చేసుకొని ఆ బియ్యం పిండి ముద్దపై దూది వత్తులు ఉంచాలి. అలాగే కరిగించిన నెయ్యిని ముద్దలో పోసి వెలిగించాలి. భూమి, నీరు, ఆకాశానికి ఆ దీపం ప్రతీక. ఆ ప్రతిమ ముందు ఆ దీపాన్ని ఉంచి 108 సార్లు ఓం వేంకటేశాయ అంటే చాలు ఎంతో మంచిదంటున్నారు. శ్రావణమాసం ప్రారంభిస్తే ఇంకా మంచిదట. సొంతిళ్ళు మాత్రమే కాదు ఆస్తి, లౌకిక కోరికలు ఇలా ఎన్నో స్వామివారి కృపతో లభిస్తాయని పండితులు చెబుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వినాయకుడిని మెట్లకింద వుంచి పూజ చేయొచ్చా?

వినాయక చతుర్థి పండుగ రోజున విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం పత్రాలు, పుష్పాలు, మోదకాలు వంటివి ...

news

కృష్ణాష్టమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి..

కృష్ణాష్టమి నాడు భక్తుడు శ్రీకృష్ణుడిని నిష్ఠతో పూజించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ...

news

రద్దీ బాబోయ్.. రద్దీ... తిరుమల క్యూ లైన్లకు తాళాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ ...

news

గన్నేరు, గరికతో వినాయకుడిని పూజిస్తే? గరికను బీరువాలో ఉంచితే?

ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తే తొలుత విఘ్నేశ్వరుడిని స్తుతించడం ఆనవాయితీ. సమస్త ...