శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (17:45 IST)

శ్రీవారి ఆలయంలో అన్యమతస్థులను తొలగించవద్దు : హైకోర్టు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందూయేతర ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను ఆదేశించింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందూయేతర ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను ఆదేశించింది. 
 
తితిదేలో పని చేస్తూ ఇతర మతాల గురించి ప్రచారం చేయడం నిషిద్ధం. ఇలా ప్రచారం చేసినందుకు 45 మంది అన్యమత ఉద్యోగులను వివరణ కోరుతూ ఇటీవల టీటీడీ నోటీసులు జారీచేసింది. అలాగే, తితిదేలో పని చేసే అన్యమతాల ఉద్యోగులను తొలగించాలని టీటీడీ పాలకమండలి తీసుకుంది. 
 
దీన్ని సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. హిందూయేతరులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని టీటీడీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హిందూయేతరులను ఉద్యోగాల్లో కొనసాగించాలని ఆదేశించింది.