Widgets Magazine

చిన్నారులకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులుంటే?

మంగళవారం, 8 మే 2018 (10:41 IST)

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. జిల్లా మండలంలోని దేవస్థానంలో మే 8వ తేదీ (మంగళవారం) నుంచి మే 10వ తేదీ వరకు ఈ వేడుక జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అఖండ దీపం వెలిగించారు. హనుమాన్ భక్తులు ఈ వేడుకకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. 
 
తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు కొండగట్టు హనుమాన్ ఆశీస్సులు ఉంటే ఆరోగ్యంగా ఉంటారనే విశ్వాసం ఉంది. ఈ క్రమంలోనే పిల్లలకు మొక్కులు చెల్లిస్తుంటారు. తలనీలాలు సమర్పిస్తారు. కొండగట్టు ఆంజనేయస్వామి పెద్ద జయంతికి మేములవాడ, భద్రాచలం దేవస్థానాల నుంచి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
 
ఎండాకాలం అందులోనూ మండే ఎండలు ఉండటంతో ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సు సౌకర్యాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. హనుమాన్ భక్తులు దీక్ష చేపట్టి.. ఈ పెద్ద జయంతికి కాలినడకను కొండగట్టు వస్తారు. హనుమాన్ దీక్షతో వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

పురావస్తు శాఖ పరిధిలోకి శ్రీవారి ఆలయం... వెనక్కి తగ్గిన కేంద్రం

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి ...

news

వేంకటేశ్వరుడికి ఏడు శనివారాలు పూజ చేస్తే?

హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన ...

news

మహాలక్ష్మి మా ఇంట్లో వుండటంలేదని అనుకుంటారు... కారణం ఏమిటంటే?

యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః జీవిత ...

news

ఏ ఉపకారం ఆశించకుండా సహాయం చేసేవారే గొప్పవారు

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది. ఆకలిగా ఉన్న వారికి ఏ ...

Widgets Magazine