శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (13:08 IST)

తలనీలాల వేలం పాట.. శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం

తలనీలాల వేలం పాటతో శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతినెలా తొలి గురువారం ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తుంటారు. గురువారం ఈ-వేలం ద్వారా నాలుగు రకాలకు చెందిన మొత్తం 3,500 కిలోలు తలనీలాలు

తలనీలాల వేలం పాటతో శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతినెలా తొలి గురువారం ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తుంటారు. గురువారం ఈ-వేలం ద్వారా నాలుగు రకాలకు చెందిన మొత్తం 3,500 కిలోలు తలనీలాలు అమ్ముడుపోయాయి. అయితే 5వ రకం, తెల్లవెంట్రుకలు పూర్తిగా అమ్ముడు కాలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కాగా, ఒకటో రకం వెంట్రుకలు కిలో రూ.22,494 చొప్పున 500 కిలోలు విక్రయించగా రూ.1.12 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రకం కిలో రూ.17,223 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.51.67 లక్షలు, మూడో రకం కిలో రూ.2,833 చొప్పున 2,400 కిలోలు విక్రయించగా రూ.69.61 లక్షలు, నాలుగో రకం కిలో రూ.1,195 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.4.41 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు తితిదే అధికారులు వెల్లడించారు.