సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (11:11 IST)

శ్రీవారి లడ్డూకు మరో గుర్తింపు.. ఎట్టకేలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌

కలియుక వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి మరో గుర్తింపు లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లైసెన్స్‌ పొందింది. గతంలో లై

కలియుక వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి మరో గుర్తింపు లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లైసెన్స్‌ పొందింది. గతంలో లైసెన్స్‌ అవసరం లేదన్న టీటీడీ అధికారులు కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చలు జరిపారు. లడ్డూ నాణ్యతపై బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
ప్రసాదం రూపంలో తయారు చేస్తున్న లడ్డూలో నాణ్యత లేదని.. లడ్డూల తయారీలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాలను పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి.  దీనిపై టీటీడీ వివరణ ఇచ్చినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంతృప్తి చెందలేదు. లడ్డూల విషయంలో నాణ్యత పాటించాలని సూచించింది. ప్రస్తుతం ఆ ప్రమాణాలకు అనుగుణంగా లడ్డూలను తయారు చేస్తుండటంతో ఎట్టకేలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ ఇచ్చింది.
 
గతంలో శ్రీవారి లడ్డూకు లైసెన్స్ తీసుకోవడానికి టీటీడీ నిరాకరించింది. లడ్డూ అనేది ప్రసాదం అని, ఇది ఆహార పదార్థం కాదని కాబట్టి దీనికి లైసెన్స్ అవసరం లేదని చెప్పింది. అంతేకాదు దీనిని ఉచితంగా, రాయితీకి ఇస్తామని తెలిపింది.