జ్వాలా గుత్తాకు పీవీ సింధు మద్దతు... వారందరికీ అభినందనలు...

pv sindhu
Last Updated: గురువారం, 11 అక్టోబరు 2018 (13:07 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న #మీటూ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు పలికింది. న్యూఢిల్లీలో జరిగిన వొడాఫోన్ సఖి సేవల ప్రారంభోత్సవంగా సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమపై జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్నందుకు వారికి అభినందనలు. ఈ సమయంలో వారిని గౌరవించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పుకొచ్చింది.
 
అలాగే, బ్యాడ్మింటన్ మాజీ డబుల్స్ షట్లర్ గుత్తా జ్వాల మానసిక వేధింపులు చేసిన క్రీడాకారుడు తన కెరీర్ ముగింపునకు కారణమయ్యాడని ఆరోపించింది. ఆమెకు కూడా పీవీ సింధు మద్దతు తెలిపింది. అదేసమయంలో తనపై ఎవరూ వేధింపులకు పాల్పడలేదని, మానసిక వేధింపులకు గురైన గుత్తా జ్వాలకు మద్దతు ప్రకటించింది. దీనిపై మరింత చదవండి :