శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:06 IST)

అరటిపండ్ల గుజ్జుతో కుడుములు తయారీ ఎలా?

కావలసిన పదార్థాలు : 
తాజా బియ్యం పిండి... నాలుగు గ్లాసులు
పంచదార పొడి... ఒక గ్లాసు 
అరటిపండ్ల గుజ్జు... 200 గ్రాములు
చిక్కటిపాలు... ఒక గ్లాసు
నెయ్యి... వంద గ్రాములు
యాలక్కాయల పొడి ... సరిపడ 
కొబ్బరి తురుము.. ఒక కాయ మొత్తం
 
తయారీ విధానం :
బియ్యం పిండిలో పంచదార పొడి, యాలక్కాయలపొడి వేసి బాగా కలపాలి. తరువాత అరపండ్ల గుజ్జు, నెయ్యి పోసి మృదువుగా పిండిని కలిపాలి. అందులోనే చిక్కటి పాలు, నెయ్యి, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి... పిండిని కావలిసిన సైజులో ఉండలుగా చుట్టి... కుక్కరు గిన్నెలో ఉంచి అరగంటసేపు ఆవిరిమీద ఉడికించాలి. అంతే అరటిపండ్ల గుజ్జుతో తయారైన కుడుములు రెడీ అయినట్లే..!
 
రొటీన్‌గా చేసే కుడుములకంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి మిగిలిపోతే పాడవుతాయన్న బెంగ కూడా అవసరం లేదు. ఎందుకంటే, మిగిలిన వాటిని నూనెలో వేయించి తీస్తే, కరకరలాడుతూ ఉంటాయి. కొన్నిరోజులపాటు నిల్వ కూడా ఉంటాయి కూడా. ఇలా వేయించేముందు తీపి సరిపోని వారు మరికాస్త పంచదార కలిపి, వాటిని మెత్తగా పిసికి ఆ తరువాత నూనెలో వేయిస్తే సరిపోతుంది.