గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2020 (21:27 IST)

కరోనావైరస్ భయం, ఇంట్లోనే ఈ లడ్డూలు చేసిపెట్టండి

ఇప్పుడు కరోనావైరస్ నేపధ్యంలో స్వీట్ షాపుల్లో ఏవైనా కొనాలంటే భయం పట్టుకుంటోంది. ఇంకోవైపు పిల్లలు చిరుతిళ్ల కోసం గోల చేస్తుంటారు. పిల్లలకి హాయిగా ఇంట్లోనే రవ్వలడ్డులు చేసిపెడితే చక్కగా తినేస్తారు. వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
తురిమిన పచ్చికొబ్బరి- రెండు కప్పులు
పంచదార- ఒకటిన్నర కప్పు
నెయ్యి- అర కప్పు
జీడిపప్పు- రెండు టీస్పూన్‌లు
కిస్ మిస్- రెండు టీస్పూన్‌లు
యాలకుల పొడి- పావు టీస్పూన్
 
తయారీ విధానం :
మొదట దళసరి మూకుడులో కొంచెం నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. పంచదార కరిగి గట్టిపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి దించుకోవాలి.
 
ఈ మిశ్రమంలో నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ఆరిపోక ముందే గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలుగా చేసేటప్పుడు ఆరిపోయినట్లనిపిస్తే, కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.