శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 డిశెంబరు 2014 (18:12 IST)

క్రిస్ మస్ స్పెషల్ : మిల్క్ కేక్ స్వీట్ తయారీ ఎలా?

క్రిస్ మస్ సందడి మొదలైంది. పండుగ కోసం క్రిస్ మస్ ట్రీ, కొత్త బట్టలు ఇతరత్రా అన్నీ రెడీ చేసుకునేందుకు సమాయత్తమయ్యారా.? అయితే ఇక ఆలస్యం చేయకుండా ఫలహారాలు కూడా సిద్ధం చేసుకోండి. ఈ క్రిస్ మస్‌కు చాలా సింపుల్ అయిన మిల్క్ స్వీట్ కూడా ట్రై చేయండి. ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు:
పంచదార : 4కప్పులు, 
పాలు : 5కప్పులు, 
బొంబాయి రవ్వ : 1కప్పు, 
నెయ్యి - 11/2 కప్పు. 
 
తయారీ విధానం:
ముందుగా పాలు, బొంబాయిరవ్వ, పంచదార, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు ఉంచి నెయ్యి పైకి తేలాక నెయ్యి రాసిన ట్రేలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి చల్లార్చాలి. ఆపైన కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అంతే మిల్క్ స్వీట్ రెడీ.