శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:48 IST)

స్వీట్ : మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసా?

శనగపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. డయాబెటిక్స్‌ను నియంత్రిస్తుంది. జింక్, క్యాల్షియం, ప్రోటీన్లు కలిగివుండే శనగపిండితో స్వీట్ మైసూర్ పాక్ రిసిపీ ఇంట్లోనే ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పంచదార - రెండు కప్పులు 
శనగపిండి - ఒక కప్పు 
నీరు - అర కప్పు 
నెయ్యి - రెండు కప్పులు 
 
తయారీ విధానం : 
ఒక స్పూన్ నెయ్యి వేసి మంచి వాసన వచ్చేవరకు పిండిని వేయించాలి. పంచదారలో నీరుపోసి కరిగాక వేయించి పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తుండాలి. నెయ్యి పిండి నుండి విడివడ్డాక, నెయ్యి రాసిన పళ్ళెంలో సమంగా పరిచి ఇష్టమైన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.