శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 జులై 2015 (18:38 IST)

పత్రికల్లో వచ్చే స్వీట్స్ చదివితే ఒబిసిటీ ఖాయమట!

పత్రికల్లో వచ్చే ఆహార సంబంధ వార్తలకూ, ఊబకాయానికి సంబంధం ఉందని ఇటీవల అధ్యయనంలో తేలింది. పత్రికల్లో ఏ విధమైన ఆహార విషయాలను చదువుతున్నారో తెలుసుకుంటే, దానిని బట్టి మూడేళ్లలో దేశ జనాభాలో ఎంతమంది ఒబిసిటీతో బాధపడుతారో కనిపెట్టడం సులభమేనని ఇటీవల అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ టైమ్స్, లండన్ టైమ్స్ వంటి పత్రికల్లో 50 ఏళ్లుగా వచ్చిన ఆహార పదార్థాల పేర్లను ఇందులో విశ్లేషించారు. 
 
ఇందులో వివిధ పత్రికల్లో ఆహార పదార్థాలపై వచ్చిన కథనాలను, దేశంలోని జనాభా సరాసరి బీఎంఐకి గల సంబంధాన్ని అధ్యయనం చేశారు. దీని ప్రకారం తియ్యటి పదార్థాల గురించి చదివినవారు మూడేళ్లలో ఊబకాయులుగా మారారని తేలింది. కూరగాయలు, పండ్లు వాటి గురించి చదివిన వారిలో ఊబకాయ సమస్య తక్కువగా ఉందని నిర్ధారించారు.