శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2015 (17:03 IST)

విజయదశమి నైవేద్యం: రవ్వతో చక్రపొంగలి ఎలా చేస్తారు?

విజయదశమికి నైవేద్యంగా చక్ర పొంగలి, గారెలు, పాయసం చేసేస్తుంటాం. అయితే చక్ర పొంగలి బియ్యంతో కాకుండా రవ్వతో ట్రై చేసి చూడండి. 
 
కావలసిన పదార్థాలు :
ఎండు కొబ్బరి ముక్కలు - రెండు కప్పులు 
నెయ్యి - అర కప్పు
జీడిపప్పు - అర కప్పు 
యాలకుల పొడి - పావు స్పూన్ 
పంచదార - ఒక కప్పు 
బెల్లం- పావు కప్పు 
బియ్యం రవ్వ - పావు కిలో 
పెసరపప్పు - పావు కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా పాత్రలో బియ్యం రవ్వను, పెసరప్పును కలుపుకుని పొడిగా ఉండేట్లు ఉడికించుకుని పక్కనబెట్టుకోవాలి. మరో పాత్రలో పంచదార, బెల్లంపొడిని కలుపుకుని కొద్దిగా నీళ్లు పోసి లేత పాకం పట్టాలి. పాకం వచ్చిన తర్వాత దించుకునే ముందు యాలకుల పొడి చేర్చాలి. ఒక బేసిన్ తీసుకుని అందులో బియ్యం రవ్వ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని అందులో పాకాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి పొంగలిలో కలుపుకోవాలి. అంతే రవ్వ చక్ర పొంగలి రెడీ అయిపోయినట్లే.