కన్నీటి బాధలోనూ కుమార్తె అవయవాలను దానం చేసిన తండ్రి..

బుధవారం, 11 జులై 2018 (12:10 IST)

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన తన కూతురు అవయవాలను దానం చేశాడు మానవత్వం ఉన్న  ఓ తండ్రి. ఇస్మాయిల్ ఖాన్ ఘట్కేసర్ మండలానికి చెందిన తాడేపల్లి జయరాంకు భార్యా, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద దిక్కుగా ఉంది. గత ఆదివారం ఉదయం తన తల్లితో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన జీహెచ్ఎంసీకి చెందిన డంపింగ్ ట్రక్ అతి వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది భార్య.
girl
 
తీవ్రంగా గాయపడిన కూతుర్ని బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కూతురు బ్రైన్ డెడ్ అయిందని డాక్టర్లు నిర్ధారించడంతో శోకసముద్రంలో మునిగిపోయాడు తండ్రి. తన కుమార్తె శ్రుతి అవయవాలను ఎవరికైనా దానం చేస్తే... వారిలో తన కూతురిని చూసుకోవచ్చని వారు అన్నారు. 
 
తన భార్యా మాధవి, కూతురు శ్రుతి మృతితో వారి కుటుంబానికి తీరని లోటని బంధువులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కూతురు అవయవాలను జీవన్ దాన్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. తన భార్య, కూతురు మృతి చెందడానికి డ్రైవర్ పూటుగా తాగడమే కారణమని, అటువంటి వారివల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయని, వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని తండ్రి కోరుతున్నాడు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కన్నా, జగన్, పవన్‌లకు ఆ దమ్ముందా? మంత్రి నక్కా సవాల్

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్న నాటకాలను కట్టిపెట్టాలని ...

news

వరదల్లో చిక్కుకున్న రైలు ప్రయాణికులు.. రక్షించిన వెస్ట్రన్ నేవీ కమాండ్

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు ...

news

#GobackAmitShah : నీలాంటి టెర్రరిస్టును రానివ్వదు... తమిళ నెటిజన్ల షాక్

కమలనాథులకు తమిళ నెటిజన్లు తేరుకోలేని షాకిచ్చారు. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినందించారు. ...

news

బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్టువేశారు... ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల ...