Widgets Magazine

వింత పిల్లలకు జన్మనిచ్చిన మేక

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ మేక వింత పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పిల్లలను చూసేందుకు స్థానికులు క్యూకట్టారు. గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం కొర్విపాడులో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్

goat
pnr| Last Updated: మంగళవారం, 26 డిశెంబరు 2017 (08:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ మేక వింత పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పిల్లలను చూసేందుకు స్థానికులు క్యూకట్టారు. గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం కొర్విపాడులో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన ఆశమ్మకు మేకలు ఉన్నాయి.

వీటిలో ఓ మేక తాజాగా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ఐదు పిల్లల్లో ఒక పిల్ల కోతి ఆకారంలో, మరోటి దూడ ఆకారంలో ఉన్నాయి. మిగితా మూడు సాధారణంగా పుట్టాయి. అయితే.. వింత ఆకారంలో జన్మించిన పిల్లలు పుట్టగానే మరణించాయి.

ఇక మేకకు జన్మించిన వింత ఆకారంలో ఉన్న పిల్లలను చూడటానికి ఆ గ్రామం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాలను చెందిన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :