Widgets Magazine

ఇంటర్ పాస్ చేస్తానని ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసిన హెడ్ మాస్టర్

శనివారం, 2 జూన్ 2018 (16:22 IST)

17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిలైంది. ఐతే తనకు కోచింగ్ ఇచ్చి పాస్ చేయించాలని అంతకుముందు టెన్త్ క్లాస్ చదివిన స్కూల్ టీచర్ వద్దకు వెళ్లింది. ఆమె అభ్యర్థనను సాకుగా తీసుకున్న సదరు ఉపాధ్యాయుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
rape
 
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలంలో 17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది. ఆమెకు ప్రధమ సంవత్సరంలో తక్కువ మార్కులు రావడంతో ఫెయిలైంది. దీనితో తనకు టెన్త్ క్లాసులో పాఠాలు చెప్పిన ప్రధానోపాధ్యాయుడు అక్బర్ గుర్తు వచ్చాడు. వెంటనే ఆయన వద్దకెళ్లి తనకు కొన్ని సబ్జెక్టులు అర్థం కావడంలేదనీ, తనకు కోచింగ్ ఇచ్చి ఎలాగైనా పాస్ చేయించాలని కోరింది. దాంతో... ఇక్కడ కాదు ఇంటికి వస్తే ప్లాన్ చేద్దామని చెప్పాడు అక్బర్. 
 
ఆయన మాటలు నమ్మిన విద్యార్థిని మాస్టారు ఇంటికి వెళ్లింది. అంతే... ఆమెకు మాయమాటలు చెప్పి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నలుగురు పిల్లలున్న మాస్టారు ఇలా దారుణానికి పాల్పడుతాడని ఊహించని ఆ బాలిక చివరికి ఎలాగో తప్పించుకుని విషయాన్ని తల్లిదండ్రుకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డేటింగ్ చేస్తున్న యువతితోనే ఆ పని చేయించాడు... పోలీసులకు దొరికిపోయారు...

డేటింగ్. ఇప్పుడు సమాజంలో ఎక్కువగా వినబడుతున్న మాట. యువతీయువకులు పెళ్లి కాకుండా ఎంచక్కా ...

news

'ఆపరేషన్ గరుడ'లో పవన్ పాత్ర అదేనా? చంద్రబాబు ఎందుకలా అన్నారు?

ఈమధ్య కాలంలో అప్పట్లో ఆపరేషన్ గరుడ అంటూ నటుడు శివాజీ తెరపైకి తెచ్చిన వ్యవహారం చర్చకు దారి ...

news

బయోపిక్‌ల బాట పట్టిన ఇండియన్ సినిమా...

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చలనచిత్ర పరిశ్రమలలో ...

news

ఈ డ్రైవర్ బస్సు ఎక్కితే యమపురికే.. చూడండి ఏం చేస్తున్నాడో?(Video)

కరీంనగర్, హుజూరాబాద్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. సెల్‌ఫోన్‌లో ...

Widgets Magazine