Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెగ తాగేస్తున్నారు... పక్క రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు

శనివారం, 14 అక్టోబరు 2017 (09:41 IST)

Widgets Magazine
cheap liquor

తెలంగాణ మద్యం బాబులు… తాగే తాగుడికి కేసులు కేసులే ఖాళీ అయిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. మరో మూడు రోజులకు సరిపడ మాత్రమే బీరు నిల్వలు ఉన్నాయట. దీంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తాజాగా నాలుగు లక్షల కేసుల బీర్లకు ఆర్డర్ ఇచ్చారు.
 
సాధారణంగా వేసవికాలంలో బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలతో సంబంధంలేదు, చలితో అసలే పనిలేదు. తాగేవాడు తాగుతూనే ఉన్నాడు. గతేడాదితో పోల్చుకుంటే 27.15 శాతం వృద్ది నమోదైందని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. సగటున రోజుకు 12 లక్షల బీర్లు చొప్పున అమ్ముతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏడెనిమిది లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకునేవారు. 
 
ఇప్పుడు ఏకంగా నాలుగు లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుంది. గత యేడాది ఏప్రిల్ ‌- సెప్టెంబరు మధ్యకాలంలో రాష్ట్రంలో రూ.6,724.82 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇదేకాలంలో 20.80 శాతం పెరిగి రూ.8,123.55 కోట్లకు అమ్మకాలు చేరుకున్నాయి. తెలంగాణ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇదే సమయంలో అమ్మకాలు 13.67 శాతం చొప్పున పెరిగాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్కూల్ గర్ల్‌పై స్పీకర్ అత్యాచారం.. వాష్‌రూమ్‌కి లాక్కెళ్లి...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ దారుణం జరిగింది. అన్యపుణ్యం తెలియని ఓ చిన్నారిపై పాఠశాలలో ...

news

జలసిరి : శ్రీశైలంకు వరద తాకిడి.. అన్ని గేట్లు ఎత్తివేత (Video)

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ...

news

హైదరాబాద్‌లోనూ బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ...

news

ఫ్లెక్సీలు కట్టినవారికి పెనాల్టీ విధించండి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ...

Widgets Magazine