Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాంగ్రెస్ పార్టీ మనకు బాగా కలిసొస్తుంది - కోదండరాంతో రేవంత్ రెడ్డి

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (19:54 IST)

Widgets Magazine
revanth reddy

టిఆర్ఎస్ పైన పోరాటం చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకుపోతున్నారు జెఎసీ ఛైర్మన్ కోదండరాం. ముందు నుంచి కెసిఆర్‌తో అభిప్రాయ భేదాలున్న కోదండాంకు తెలంగాణా ప్రజల సపోర్టు చాలానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి కోదండరాం కొత్త రాజకీయ పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కోదండరాం ఇంటికి వెళ్ళి ఆయన్ను కలిశారు. 
 
రాహుల్ గాంధీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టే ఉంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన్ను వ్యతిరేకించినా రేవంత్‌కు తెలంగాణా రాష్ట్రంలో మంచి పేరుందనేది అందరికీ తెలిసిన విషయమే. కోదండరాం లాంటి మంచి వ్యక్తి, సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరమరన్న ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అందుకే సొంతంగా పార్టీ పెడుతున్న కోదండరాంను రేవంత్ రెడ్డి స్వయంగా కలిశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీలోకి మీరు రావడం చాలా ఉత్తమం. మనకందరికీ కాంగ్రెస్ పార్టీ బాగా కలిసొస్తుంది. కెసిఆర్ లాంటి కుటుంబ పాలనకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం పులిస్టాప్ పెడదామంటూ రేవంత్ రెడ్డి కోదంరాంకు చెప్పినట్లు తెలుస్తోంది.
 
అయితే తనకు కొద్దిగా సమయం కావాలని, ఇప్పటికే సొంత పార్టీ పెట్టేందుకు సమాయత్తమయ్యాయని, తన వెంట నడిచేందుకు కొంతమంది నేతలు కూడా సిద్థంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ కాకుండా ఉన్న పార్టీలలోకి వెళితే ఇబ్బందులు పడతామన్నది కోదండరాం ఆలోచన. అందుకే రేవంత్ రెడ్డి కలిసినా ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండంటూ కోరినట్లు తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ మధ్య జరిగిన రాజకీయ భేటీని బయట తెలుపకుండా తన ఇంటిలో జరిగే ఒక ఫంక్షన్‌కు కోదండరాంను ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పకోడీల వ్యాపారానికి లోను ఇప్పించండి.. స్మృతి ఇరానీకి బీజేపీ కార్యకర్త లేఖ

పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉపాధేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ముహుర్తాన వ్యాఖ్యానించారో ...

news

బీజేపీకి ఆ భయం వుండొచ్చు.. ముఖేష్ అంబానీలాంటి వ్యక్తే?: జేసీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చూసి బీజేపీకి భయం వుండొచ్చునని టీడీపీ ...

news

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి శిక్ష పడింది... రెండేళ్ళ జైలు

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షిపై చేయి చేసుకుని ఆ తర్వాత అధికార బలంతో ఆ ...

news

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు ...

Widgets Magazine